శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశంలోని వివిధ జిల్లాల్లో 850 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకరించిన - డి.ఆర్‌.డి.ఓ. కార్యదర్శి

Posted On: 14 JUN 2021 4:12PM by PIB Hyderabad

 

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి వీలుగా, దేశ అవసరాలను తీర్చడానికి, "పి.ఎం. కేర్స్ నిధి" తో, దేశంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 850 ఆక్సిజన్ ప్లాంట్ల ను ఏర్పాటు చేయనున్నట్లు, శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఏ.ఎస్.టి) నిర్వహిస్తున్న ఆజీదీ కా అమ్రిత్ మహోత్సవ్ ప్రసంగాల పరంపరలో భాగంగా, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) కార్యదర్శి డాక్టర్ సి. సతీష్ రెడ్డి, మాట్లాడుతూ, తెలియజేశారు. 

అవసరం వచ్చినప్పుడు అన్ని రకాలుగా సహాయం అందించడానికి డి.ఆర్.డి.ఓ. సిద్ధంగా ఉందని, ఆయన చెప్పారు.  ప్రజలకు సహాయపడటానికి, కోవిడ్-19 రెండవ దశలో, డి.ఆర్.డి.ఓ. ఏర్పాటు చేసిన, మరిన్ని ఎగిరే ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన తెలియజేశారు. 

ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ, "మేము చాలా నగరాల్లో కోవిడ్-19 కు ప్రత్యేకమైన తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసాము. ఇవి మాడ్యులర్ ఆసుపత్రులు, వీటిని ఎగిరే ఆసుపత్రులు గా వ్యవహరిస్తున్నాము. వైరస్ బయటకు వ్యాప్తి చెందని విధంగా ఈ ఆసుపత్రులను తయారు చేయడం జరిగింది. ఒక వేళ, మూడవ దశ వచ్చే అవకాశం ఉంటే, అందుకు అవసరమైన సౌకర్యాలు అన్ని ఆసుపత్రుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ అంశాలపై వివిధ భాగస్వాములతో చర్చిస్తోంది", అని వివరించారు. 

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, డి.ఆర్.డి.ఓ. రక్షణ రంగంలో, ప్రధానంగా చేస్తున్న పరిశోధనల గురించి ఆయన ఈ సందర్భంగా, వివరిస్తూ,  అంతర్జాతీయ స్థాయికి సరిపోయేలా తక్కువ ఖర్చుతో ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే అధిక-నాణ్యతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం పై కూడా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. 

సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ జాతీయ మండలి మరియు విజ్ఞాన్ ప్రసార్ సంయుక్తంగా ఆన్-లైన్ ద్వారా నిర్వహిస్తున్న న్యూ ఇండియా@75 అనే ప్రసంగాల పరంపర కార్యక్రమంలో డాక్టర్ రెడ్డి ప్రసంగించారు.

మహమ్మారిపై పోరాడటానికి కేంద్ర ప్రభుత్వం మరియు  డి.ఎస్‌.టి. చేపట్టిన వివిధ చర్యల గురించి, అదేవిధంగా, టీకాల ను ఎలా సురక్షితంగా ఉంచాలి, వాటిని దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ ఏవిధంగా చేర్చాలీ అనే విషయాల గురించి,  డి.ఎస్‌.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలియజేశారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో కృత్రిమ మేధస్సు (ఏ.ఐ) ఎక్కువ పాత్ర పోషించగల మార్గాల గురించి కూడా ఆయన మాట్లాడారు.

"దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ, టీకాలను రవాణా చేయడానికీ, నిల్వ చేయడానికి వీలుగా అనువైన సాంకేతికతలు అభివృద్ధి చేయబడ్డాయి.  భారతీయ పరిస్థితులకు అనుగుణంగా టీకాలను నిల్వ చేయడానికి కొత్త మార్గాలు అభివృద్ధి చేయబడ్డాయి.  భవిష్యత్తులో  సాంకేతికతల కలయిక కీలకం.  వ్యాధి నిర్ధారణ, టెలిమెడిసిన్ రంగాలలో కృత్రిమ మేధస్సు గొప్ప పాత్ర పోషించనుంది.  దూర ప్రాంతాల నుండి పర్యవేక్షణ, వ్యాధి నిర్ధారణ తో పాటు, మహమ్మారిని ఎదుర్కోడానికి తగిన నిర్ణయం తీసుకోవడంలో కూడా దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది." అని ప్రొఫెసర్ శర్మ ఈ సందర్భంగా తెలియజేశారు. 

50 సంవత్సరాల  డి.ఎస్.టి. సుదీర్ఘ ప్రయాణం గురించి, ఆయన వివరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం పునాదిగా, దేశ ప్రగతి, అభివృద్ధి కోసం యువ ప్రతిభకు సహకారం అందించి, ప్రోత్సహించి, పొందించడానికి, డి.ఎస్.టి. ని ఒక నర్సరీ గా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

 

 *****



(Release ID: 1727091) Visitor Counter : 210