వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ " స్వచ్ఛమైన వాతావరణం మరియు సమగ్ర, స్ధిరమైన అభివృద్ధి అనేది భారతదేశానికి ప్రాధాన్యత ఎజెండా" అని చెప్పారు.


పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అత్యల్ప తలసరి సిఓ2 ఉద్గారాలు ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధి మరియు ఎస్‌డిజిలపై యూఎన్‌ 2030 అజెండా పట్ల భారతదేశం తన నిబద్ధతను చూపించింది;

స్వచ్ఛమైన ఇంధనం , ఇంధన సామర్థ్యం, అటవీ నిర్మూలన మరియు జీవ వైవిధ్యంపై భారతదేశం చాలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంది;

పర్యావరణం మరియు సుస్థిరతకు సంబంధించిన చర్యలు వాణిజ్యంతో ముడిపడి ఉండకూడదు

Posted On: 14 JUN 2021 5:51PM by PIB Hyderabad

రైల్వే, వాణిజ్యం & పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు మాట్లాడుతూ" భారతదేశ తలసరి సిఓ2 ఉద్గారాలు పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే అత్యల్పంగా ఉన్నాయని, అయినప్పటికీ భారతదేశంలో తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. మరియు 2030 నాటికి 450 గిగావాట్ల ప్రతిష్టాత్మక పునరుత్పాదక ఇంధన లక్ష్యం ఐక్యరాజ్యసమితి 2030 అజెండా ఆన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ పట్ల మా నిబద్ధతను చూపిస్తుంది. యుఎన్ ట్రేడ్ ఫోరం 2021 లో మాట్లాడుతూ మనమందరం చాలా ఆందోళన చెందుతున్నామనడంలో సందేహం లేదని  అన్నారు. మా వాతావరణ లక్ష్యాలను సాధించడానికి కొవిడ్ అనంతర ప్రపంచంలో పునరుద్ధరించిన ఉత్సాహంతో మేము పని చేస్తాము. వాతావరణ న్యాయం పరిరక్షించబడాలని మరియు అభివృద్ధి చెందిన దేశాలు వారి వినియోగ విధానాన్ని పునఃపరిశీలించి స్థిరమైన జీవనశైలిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

స్వచ్ఛమైన ఇంధనం, ఇంధన సామర్థ్యం, అటవీ నిర్మూలన మరియు జీవ వైవిధ్యంపై భారత్ చాలా సాహసోపేతమైన చర్యలు తీసుకుందని అందుకే ఎన్‌డిసిలు (జాతీయంగా నిర్ణయించిన విధానాలు) 2-డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉన్న కొద్ది దేశాలలో భారతదేశం ఉందని మంత్రి అన్నారు. "అంతర్జాతీయ సౌర కూటమి మరియు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి ప్రపంచ కార్యక్రమాలను కూడా మేము ప్రోత్సహించాము" అని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య విధానం  మరింత సమగ్ర వృద్ధి కోసం చూడాలని  శ్రీగోయల్ అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం మరియు సమగ్ర అభివృద్ధి అనేది స్థిరమైనది. ఇది భారతదేశానికి ప్రాధాన్యత ఎజెండా అని ఆయన అన్నారు. పర్యావరణం మరియు సుస్థిరతకు సంబంధించిన చర్యలు వాణిజ్యంతో ముడిపడి ఉండకూడదని భారతదేశం యొక్క దీర్ఘకాల విధానం  అని మంత్రి అన్నారు.

వాతావరణ మార్పులపై తమ హామీలను నెరవేర్చడానికి ప్రపంచాన్ని ఒకచోట చేర్చడంపై యుఎన్ & యుఎన్‌ఎఫ్‌సిసి దృష్టి పెట్టాలని శ్రీ గోయల్ అన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను యుఎన్‌ఎఫ్‌సిసి ఫ్రేమ్‌వర్క్ మరియు పారిస్ ఒప్పందం కింద చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే వాణిజ్య చర్చలలో భాగంగా కాదు. ఈ లక్ష్యాలను సాధించడానికి వాణిజ్య ఒప్పందాలు మొదటి ఉత్తమ ఎంపిక కాదు అని చెప్పారు.

శ్రీ గోయల్ పరిశుభ్రమైన వాతావరణం కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ " గత 7 సంవత్సరాలుగా మేము భారతదేశంలో 100% విద్యుత్ కనెక్షన్లు, 100% మరుగుదొడ్లు , 100% ఆర్థిక చేరిక మరియు 100% జనాభాకు వంట గ్యాస్ అందించడంపైదృష్టి సారించాము. 2030 నాటికి భారత రైల్వే క్లిన్ ఎనర్జీతో నడుస్తుందని, ‘నెట్ జీరో’ రైల్వే అవుతుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న జి 7 దేశాలకు వివరించారని ఆయన అన్నారు. భారతదేశం చలనశీలతను చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భవిష్యత్తులో చైతన్య సాధనంగా హైడ్రోజన్‌ను అభివృద్ధి చేయడంలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.

ఆరోగ్య సంరక్షణపై భారీ పెట్టుబడి భారతదేశ లక్ష్యమని  ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి & మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారిస్తోందని శ్రీ గోయల్ అన్నారు. టీకాలు మరియు ఔషధాల సమాన లభ్యతను నిర్ధారించడంలో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. భారతదేశాన్ని తరచుగా ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచానికి టీకాలు వేసే ఈ ప్రయత్నంలో మనకు ఒక ముఖ్యమైన అంశం కావాలనే సామర్థ్యం మరియు ఉద్దేశ్యం ఉందని ఆయన అన్నారు. " ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ఉంది..దీని కింద భారతదేశంలో 500 మిలియన్ల మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పౌరుడికి 100% కవరేజీకి విస్తరించబోతున్నాం ”అని ఆయన అన్నారు.

ప్రకృతి మనకు ముఖ్యమని దాన్ని రక్షించడం మన సమిష్టి బాధ్యత అని శ్రీ గోయల్ అన్నారు. అయినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల ఎజెండాకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇవ్వలేము, కానీ వ్యవసాయ రాయితీలలో అసమానతలు వంటి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించలేము అన్నారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడుతూ " కొవిడ్ మహమ్మారి సమయంలో 80 కోట్ల మంది భారతీయులకు భారతదేశం ఉచిత ఆహార ధాన్యాన్ని అందించిందని అన్నారు. "మా ప్రజా పంపిణీ కార్యక్రమాల  కారణంగా ఆకలితో ఎవరూ చనిపోకుండా చూసుకోవడానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు మేము అలాంటి సహాయాన్ని అందించగలుగుతున్నాము." అన్నారు.

ప్రపంచంలోని ఆర్థిక నిర్మాణాన్ని నిర్దేశించే ఐఎంఎఫ్‌ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అభివృద్ధి చెందుతున్న మరియు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలపై అన్యాయంగా కఠినంగా వ్యవహరించవని శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరింత కరుణతో, ఉదారంగా మరియు సహాయంగా ఉండవలసిన సమయం ఇది అని ఆయన అన్నారు.

పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాలను అన్వేషించాలని మంత్రి ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరసమైన హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు ముందడుగు వేయాలి. మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో తయారయ్యే స్వచ్ఛమైన /హరిత ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌ను కూడా అందించాలని కోరారు.


 

****


(Release ID: 1727085) Visitor Counter : 140