ఆర్థిక మంత్రిత్వ శాఖ

44 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం సిఫార్సులు


వస్తువుల జిఎస్‌టి రేట్లలో మార్పులు కోవిడ్-19 నుండి ఉపశమనానికి, నిర్వహణకు ఉపయోగపడతాయి

Posted On: 12 JUN 2021 3:39PM by PIB Hyderabad

44 వ జిఎస్‌టి కౌన్సిల్ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైంది. 2021 సెప్టెంబర్ 30 వరకు కోవిడ్-19 నుండి ఉపశమనం, నిర్వహణకు ఉపయోగిస్తున్న నిర్దిష్ట వస్తువులపై జిఎస్‌టి రేట్లను తగ్గించాలని కౌన్సిల్ తన సమావేశంలో నిర్ణయించింది.

ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌తో పాటు రాష్ట్రాలు, యుటిల ఆర్థిక మంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సిఫార్సుల వివరాలు ఇలా ఉన్నాయి:

వరుస సంఖ్య

వివరణ 

ప్రస్తుత జిఎస్‌టి రేటు    

జిఎస్‌టి కౌన్సిల్ సిఫార్సు చేసిన జిఎస్‌టి రేటు 

  1. ఔషధాలు 

1.

తోసిలిజుమాబ్

5%

మార్పు లేదు 

2.

యాంఫోటెరిసిన్ బి

5%

మార్పు లేదు

3.

హెపారిన్ వంటి యాంటీ కోగ్యులెంట్స్

12%

5%

4.

రెమ్‌డెసివిర్

12%

5%

5.

కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓ హెచ్ఎఫ్డబ్ల్యూ ), ఫార్మా డిపార్ట్మెంట్ (డిఓపి) సిఫారసు చేసిన ఇతర మందులు

వర్తించే రేటు 

 

5%

  1. ఆక్సిజన్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు మరియు సంబంధిత వైద్య పరికరాలు

1.

మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్

12%

5%

2.

వ్యక్తిగత దిగుమతులతో సహా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్/ జనరేటర్

12%

5%

3.

వెంటిలేటర్లు 

12%

5%

4.

వెంటిలేటర్ మాస్కులు/కాన్యులా/హెల్మెట్ 

12%

5%

5.

బిపాప్ మెషిన్ 

12%

5%

6.

హై ఫ్లో నాసల్ కాన్యులా (హెచ్ఎఫ్ఎన్సి) పరికరం 

12%

5%

  1. టెస్టింగ్ కిట్లు, మెషిన్లు 

1.

కోవిడ్  టెస్టింగ్ కిట్లు 

12%

5%

2.

నిర్దిష్ట ఇన్ఫ్లమేటరీ డయాగ్నొస్టిక్ కిట్లు..  అవి డి-డైమర్, ఐఎల్-6, ఫెర్రిటిన్ మరియు ఎల్డీహెచ్ఎస్ 

12%

5%

  1. కోవిడ్-19 సంబంధిత ఇతర పరికరాలు 

1.

పల్స్ ఆక్సిమీటర్లు

12%

5%

2.

హ్యాండ్ శానిటైజర్ 

18%

5%

3.

శరీర ఉష్ణోగ్రత తెలుసుకునే పరికరాలు

18%

5%

4.

శ్మశానవాటిక కోసం గ్యాస్ / ఎలక్ట్రిక్ / ఇతర ఫర్నేసులు, వాటి సంస్థాపనతో సహా.

18%

5%

5.

అంబులెన్సులు 

28%

12%

 

ఈ రేటు తగ్గింపులు / మినహాయింపులు 2021 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయి.

*****


(Release ID: 1726671) Visitor Counter : 290