ఆయుష్
ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ నిర్వహణకు సన్నాహక సమావేశం
నమస్తే యోగా యాప్ ఆవిష్కరణ
Posted On:
12 JUN 2021 10:17AM by PIB Hyderabad
ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక సమావేశాన్ని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండిఎన్ఐవై)తో కలసి ఆయుష్ మంత్రిత్వశాఖ ఘనంగా నిర్వహించింది. శుక్రవారం రాత్రి గంటకు పైగా జరిగిన సమావేశానికి ఇద్దరు కేంద్రమంత్రులతో సహా ప్రముఖ యోగా గురువులు, యోగా నిపుణులు హాజరయ్యారు, వర్చువల్ విధానములో జరిగిన సమావేశంలో యోగా కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'నమస్తే యోగా' యాప్ ను ఆవిష్కరించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు, యోగా గురువులు, నిపుణులు యోగా ప్రాధాన్యతను దీనివల్ల దైనందిన జీవితంలో వచ్చే మార్పులను, యోగా వల్ల మానవాళికి, వ్యక్తులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిరెన్ రిజిజులు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 ప్రాధాన్యతను వివరించారు. 2021 యోగ దినోత్సవాన్ని ' యోగాతో ఉండండి ఇంట్లోనే ఉండండి 'అన్న నినాదంతో నిర్వహించనున్నారు. ప్రముఖ యోగా గురువులు శ్రీ రవిశంకర్, సద్గురు జగ్గీ వాసుదేవ్, సిస్టర్ శివాని, స్వామి చిదానంద సరస్వతి యోగాతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక, దైనందిన అంశాలను వివరించారు. కోవిడ్ నేపథ్యంలో యోగా చేయడం వల్ల ప్రయోజనాలను వారు వివరించారు. సమేవేశంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వివరించారు.
సమావేశంలో మాట్లాడిన శ్రీ ప్రకాష్ జవదేకర్ యోగాతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చునని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో యోగాకి ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తెలిపారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ లో 10 రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆయుష్ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు తెలిపారు. 'యోగా చేయండి-ఇంట్లో ఉండండి ' అన్న నినాదంతో 2021 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆరోగ్య రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో దీనికి ప్రాధాన్యత ఉందని అన్నారు. యోగా చేయడం వల్ల రోగనిరోధకశక్తి ఎలా పెరుగుతుంది ఒత్తిడి నుంచి ఎలా తప్పించుకోవచ్చును అన్న అంశాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఆరోగ్య సంరక్షణ, రోగ నివారణ అంశాల్లో యోగాకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. గతంలో కంటే ఎక్కువగా ప్రజలు ఎక్కువగా అంతర్జాతీయ యోగ దినోత్సంలో పాల్గొనేలా చూడాలన్న లక్ష్యంతో ఈసారి కార్యక్రమాలను రూపొందించామని మంత్రి తెలిపారు. యోగాతో కలిగే శారీరక, మానసిక శాంతిని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తెలుసుకుని యోగా పాటించేలా చూస్తామని అన్నారు. యోగా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ' నమస్తే యోగా' యాప్ ప్రారంభించిన మంత్రి ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి,యోగాకి సంబందించిన అన్ని అంశాలతో దీనికి రూపకల్పన చేశామని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యోగాకి కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా మానవాళి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే అంశంగా గుర్తించవలసి ఉంటుందని యోగా గురువులు స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులు తీసుకొని రాడానికి యోగా ఉపకరిస్తుందని అన్నారు.
కోవిడ్ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడే మార్గాన్ని యోగా చూపిస్తుందని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి యోగా చేయాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించారు. యోగా అనేది ప్రాచీన కాలం నుండి అభ్యసిస్తున్న ఒక చికిత్స మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం అని స్వామి చిదానంద్ సరస్వతి అన్నారు. సమగ్ర జీవనానికి యోగ ఒక శాస్త్రీయ విధానమని ఎస్ వ్యాస విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ ఆర్ నాగేంద్ర అన్నారు. సిస్టర్ శివానీ, స్వామి భారత్ భూసన్, ప్రొఫెసర్ తనూజనేసరి, డాక్టర్ బిఎన్ గంగాధర్, శ్రీ కమలేష్ డి. పటేల్, శ్రీ ఓపి తివారీ, యోగాచార్య మరియు శ్రీ ఎస్. శ్రీధరనాల్సో తమ అభిప్రాయాలను వివరించారు.
యోగకి ప్రాచుర్యం కల్పించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యలను ఆయుష్ కార్యదర్శి వి.డి. రాజేష్ కోటేచా మరియు జాయింట్ సెక్రటరీ పిఎన్ రంజిత్ కుమార్ వివరించారు.
20 జూన్ 2021 నుండి 21 వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిడి ఇండియాలో ప్రసారం కానున్న10-ఎపిసోడ్ సిరీస్ సన్నాహక సమావేశంతో ప్రారంభం అయ్యింది. . ఈ ధారావాహికను మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY) నిర్మించింది.
ఎండిఎన్ఐవై డైరెక్టర్ డాక్టర్ ఐవి బసవరడ్డి మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ మీడియా సలహాదారు సంజయ్ దేవ్ లు చర్చా గోష్ఠిని నిర్వహించారు.
***
(Release ID: 1726615)
Visitor Counter : 153