ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇమ్యునైజేషన్‌పై అపోహల తొలగింపు
వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంలోనే కోవిడ్ -19 వాక్సిన్ కమ్యూనికేషన్ వ్యూహం కింద
వాక్సిన్ పై సంశయానికి సంబంధించిన వివరాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ.
వాక్సిన్ వేయించుకోవడంలో సంశయ సమస్యకు సంబంధించిన అంశాలపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిరంతరం సన్నిహితంగా కలిసి పనిచేస్తోంది.
Posted On:
11 JUN 2021 2:51PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి 16 వ తేదీ నుంచి , మొత్తం ప్రభుత్వ విధానం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాల కృషికి మద్దతునిస్తూ వస్తోంది.
కొన్ని గ్రామీణ ప్రాంతాలలో వాక్సన్ వేయించుకోవడానికి కొందరు ఆరోగ్య కార్యకర్తలు సంశయిస్తున్నట్టు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
వాక్సిన్ విషయంలో సంశయం అనేది అంతర్జాతీయంగా ఉన్నదే నని ఇందుకు సంబంధించి కమ్యూనిటీ స్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించాలని సూచించడం జరిగింది.దీనిని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ -19 వాక్సిన్ కమ్యూనికేషన్ వ్యూహాన్నిఇ 2021 జనవరి 25న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపడం జరిగింది. కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దీనిని పంపడం జరిగింది. ఈ వ్యూహాన్ని అన్ని రాష్ట్రాలకు చెందిన నేషనల్ హెల్త్ మిషన్‌కు చెందిన డైరక్టర్లు అందరికీ 2021 జూన్ 25న పంపడం జరిగింది. ఇది కోవిడ్ -19 వాక్సినేషన్ కమ్యూనికేషన్ వ్యూహానికి సంభంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన రాష్ట్ర ఇమ్యునైజేషన్, ఐఇసి అధికారుల ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగంగా వారికి పంపడం జరిగింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వం సూచించిన వ్యూహంతో పాటు, స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యూహం అమలు చేస్తున్నాయి. పలు ఐసిసి మెటీరియళ్లు, ప్రింట్,, సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాకు నమూనాను రాష్ట్రస్థాయిలో చేపట్టడానికి అందజేయడం జరిగింది.
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వాక్సిన్ కు సంబంధించిన సంశయాలపై రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాలతో నిరంతరం సన్నిహితంగా కలసి పనిచేస్తొంది.దీనికితోడు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్ -19 వాక్సిన్, కోవిడ్ వ్యాప్తి నిరోధక ప్రవర్తనకు సంబంధించి గిరిజన కమ్యూనిటీలలో అవగాహన కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గిరిజన వ్యవహారాల శాఖ సన్నిహిత సహకారంతో కలసి పనిచేస్తోంది.
*****
(Release ID: 1726613)
Visitor Counter : 180