గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పిఎంఎవై (అర్బన్) కింద 3.61 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలకు ఆమోదం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థల పనితీరు గుర్తించేందుకు వందరోజుల సవాలు- పిఎంఎవై-యు అవార్డులు 2021 ప్రారంభం.
ఇప్పటివరకు 112.4 లక్షల గృహాలకు ఆమొదం, 82.5 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభం
టెక్నోగ్రాహి లో ఈ మాడ్యూల్, గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్- ఇండియా కింద ఎంపిక,
Posted On:
09 JUN 2021 11:57AM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పిఎంఎవై-యు) కింద 2021 జూన్ 8న ప్రభుత్వం 709 ప్రతిపాదనలకు సంబంధించి 3.61 లక్ష ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర అనుమతులు, పర్యవేక్షణ కమిటీ (సిఎస్ఎంసి), న్యూఢిల్లీలో పిఎంఎవై-యు కింద జరగిన సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశౄనికి 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు హాజరయ్యారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో లబ్దిదారుల నేతృత్వంలో చౌక గృహ నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిపాదించారు.
దీనికితోడు, పిఎంఎవై-యు అవార్డ్స్-100 రోజుల ఛాలెంజ్‌ను కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా ప్రారంభించారు. ఈ అవార్డులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్‌బిలు), లబ్ధిదారులు విజయవంతంగా ఈ మిషన్‌ను అమలు చేసినందుకు గుర్తుగా వారి విజయాలకు అభినందనగా ఈ అవార్డులను ఇస్తారు. అలాగే ఆరొగ్యకరమైన పోటీని సృష్టించేందుకు వీటిని ఇస్తారు.
కోవిడ్ -19 మహమ్మారి తర్వాత జరిగిన తొలి సిఎస్ఎంసి సమావేశం ఇది. పట్టణ ప్రాంతాలలోని అర్హులైన అందరు లబ్ధిదారులకు 2022 నాటికి పక్కా ఇళ్లు మంజూరు చేసే లక్ష్యంతో అందరికీ ఇళ్లు అన్న దార్శనికతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం దీనితో అర్థమౌతున్నది. పిఎంఎవై(యు) కింద నిర్ణీత వ్యవధిలో దేశవ్యాప్తంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ, పట్టణవ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎం.హెచ్.యు.ఎ) గృహనిర్మాణాలను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టి, వీటిని సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తోంది.
గృహాల మంజూరుకు డిమాండ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గరిష్ఠ స్థాయికి చేరిందిన. వినియోగించ కుండా ఉన్న నిధుల వినియోగం, గృహ నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేయించడం తమ ముందున్న లక్ష్యాలని శ్రీ దుర్గాశంకర్ మిశ్రా , ఈ సమావేశంలో అన్నారు.
దీనితో ఇప్పటివరకు పిఎంఎవై (యు) కింద మంజూరైన మొత్తం ఇళ్లు 112.4 లక్షలు. ఇంతవరకు 82.5 ఇళ్లనిర్మాణం ప్రారంభమైంది. అదులో 48.31 లక్షల ఇళ్లు పూర్తి అయి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మొత్తం పెట్టుబడి రూ 7.35 లక్షల కోట్ల రూపాయలు ఇందులో కేంద్ర సహాయం 1.81 లక్షల కోట్ల రూపాయలు ఇందులో 96,067 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది.
కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఈ సమావేశంలో పాల్గొన్న రాష్్టరాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుద్దేశించి ప్రసంగిస్తూ, 2021 జనవరిలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టుల (ఎల్‌హెచ్‌పిల)ను ప్రముఖంగా ప్రస్తావించారు. ఎల్.హెచ్.పిలు అగర్తల, చెన్నై, రాంచి, రాజ్‌కోట్,ఇండోర్ లలో నిర్మితమౌతున్నాయి. ఈ ఎల్.హెచ్.పిలు నిర్మాణ రంగంలోని సంబంధిత అన్ని విభాగాలను కలుపుకుపోవలసి ఉంటుంది. అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం అవసరం అని ఆయన అన్నారు. వినూత్న నిర్మాణ సాంకేతికతలకు సంబంధించి ఈ మాడ్యూల్ అభ్యసన ఉపకరణాలను ఈ 6 ఎల్.హెచ్.పి ప్రాజెక్టులలో ఉపయోగించేందుకు ఆవిష్కరించడం జరిగింద.వినూత్న నిర్మాణ సాంకేతికరంగంలో స్టేక్‌హొల్డర్ల సామర్ధ్యాలను మరింతగా పెంచే దిశగా ఇది ఉపయోగపడుతుందన్నారు.
హర్యానలోని పంచకులలో నూతనంగా నిర్మించిన నమూనా హౌసింగ్ ప్రాజెక్టును ఎం.ఒ.హెచ్.యు.ఎ కార్యదర్శి ప్రారంభించారు. దీనని అద్దెప్రాతిపదికన వర్కింగ్ ఉమన్ హాస్టల్‌గా వినియోగిస్తారు.పిఎంఎవై-యు టెక్నాలజీ సబ్ మిషన్ కింద ఆ నమూనా హౌసింగ్ ప్రాజెక్టులను ఇప్పటివరకూ పూర్తి చేశారు.మరో 7ను దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్మిస్తున్నారు. ఈ నమూనా గృహ నిర్మాణ ప్రాజెక్టులను నూతన ,ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోపాటు, గృహ నిర్మాణ రంగంలొని వివిధ విభాగాల ప్రాక్టీషనర్లు, విద్యార్ధులకు ఆన్‌సైట్ శిక్షణకు వేదికగా ఇవి ఉపయోగపడనున్నాయి.
***
(Release ID: 1726397)
Visitor Counter : 238