రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు నియమావళిని జారీ చేసిన రోడ్డు రవాణా& హైవేల మంత్రిత్వ శాఖ
జారీ చేసిన నియమావళి 01 జులై, 2021 నుంచి అమలులోకి వస్తుంది
Posted On:
11 JUN 2021 2:10PM by PIB Hyderabad
గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు కొన్ని తప్పనిసరి నియమావళిని రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) జారీ చేసింది. ఈ నియమ నిబంధనలు 01 జులై, 2021 నుంచి అమలులోకి వస్తాయి. అటువంటి కేంద్రాలలో నమోదు చేసుకునే అభ్యర్ధులకు సరైన శిక్షణను, జ్ఞానాన్ని అందించేందుకు ఇది తోడ్పడుతుంది. గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు జారీ చేసిన నియిమాలలో ప్రముఖ అంశాలు -
1. అభ్యర్ధులకు అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణను అందించేందుకు కేంద్రాలకు సిమ్యులేటర్లు, అంకితమైన డ్రైవింగ్ ట్రాకులను కల్పిస్తారు.
2. మోటార్ వాహనాల చట్టం, 1988 కింద అవసరమైన పునశ్చరణ, పరిహారాత్మక కోర్సులు ఈ కేంద్రాలలో పొందవచ్చు.
3. ఈ పరీక్షా కేంద్రాలలో విజయవంతంగా పాస్ అయిన అభ్యర్ధులకు డ్రైవింగ్ లైసెన్స్‌కు దాఖలు చేసుకున్న సమయంలో ప్రస్తుతం ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఒ) నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది. అటువంటి గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రాల నుంచి శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ పొందిందేందుకు తోడ్పడుతుంది.
4. ఈ కేంద్రాలను పరిశ్రమలకు నిర్ధిష్ట ప్రత్యేక శిక్షణలను నిర్వహించేందుకు కూడా అనుమతిస్తారు.
భారతీయ రహదారుల రంగంలో నైపుణ్యం కలిగిన డ్రైవర్ల కొరత పెద్ద సమస్యగా ఉంది. రహదారి నియమాల పట్ల అవగాహన లేమి కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు నియమ నిబంధనలను తయారు చేసి, జారీ చేసేందుకు మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019లోని సెక్షన్ 8 అధికారాన్ని ఇస్తుంది.
***
(Release ID: 1726260)
Visitor Counter : 295