హోం మంత్రిత్వ శాఖ
ప్రతిష్టాత్మక 'పద్మ అవార్డులు-2022'లకు నామినేషన్లు ఆహ్వానం
నామినేషన్లు/ సిఫార్సులకు సెప్టెంబర్ 15,2021 వరకు గడువు
Posted On:
10 JUN 2021 4:34PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవం-2022 సందర్భంగా ప్రకటించాల్సి ఉన్న పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/ సిఫార్సులు తెరవబడ్డాయి. పద్మ అవార్డులకు నామినేషన్ల చివరి తేదీ సెప్టెంబర్ 15, 2021. జాతీయ స్థాయిలో అందించే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/ సిఫార్సులు ఆన్‌లైన్‌లో ఈ కింది పోర్టల్ https://padmaawards.gov.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954 లో స్థాపించబడిన ఈ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి. ఈ అవార్డు 'వర్క్ ఆఫ్ డిస్టింక్షన్' ను గుర్తించటానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వివిధ కళలు, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజాసంబంధాలు, సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సివిల్ మొదలైన రంగాలలోను.. విభాగాలలో విశిష్టమైన మరియు అసాధారణమైన విజయాలు/ సేవలకు గాను ఈ పురస్కరాలు ఇవ్వడం జరుగుతుంది. జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప పీఎస్‌యులలో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు. పద్మ అవార్డులను “పీపుల్స్ పద్మ” గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల దేశ పౌరులందరూ స్వీయ నామినేషన్‌లతో సహా నామినేషన్లు / సిఫార్సులు చేయాలని అభ్యర్థించడమైంది. పద్మ నామినేషన్లు / సిఫారసులలో పైన పేర్కొన్న పద్మ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో పేర్కొన్న అన్ని సంబంధిత వివరాలను కలిగి ఉండాలి. సిఫారసు చేయబడిన వ్యక్తి యొక్క సంబంధిత రంగం / విభాగం విశిష్ట మరియు అసాధారణమైన విజయాలు/ సేవలను స్పష్టంగా తెలియపరచాలి. దీనికి సంబంధించి కథనము రూపంలో (గరిష్టంగా 800 పదాలు) తెలియపరచాలి. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలు.. భరత రత్న మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్రతిభా వంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయవచ్చని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. సమాజంలోని బలహీన వర్గాలు, ఎస్సీలు మరియు ఎస్టీలు, దివ్యంగ్ వ్యక్తులు సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని ఇందుకు సిఫారసు చేయవచ్చు. పద్మ అవార్డులకు సంబంధించిన మరిన్ని వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో (www.mha.gov.in) 'అవార్డులు, పతకాలు' శీర్షికలో లభిస్తాయి. ఈ అవార్డులకు సంబంధించిన శాసన విషయాలు నియమాలు వెబ్‌సైట్‌లో https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్‌తో అందుబాటులో ఉన్నాయి.
*****
(Release ID: 1726107)
Visitor Counter : 597
Read this release in:
Kannada
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam