శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎన్ 95 రెస్పిరేటర్‌కు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ ముల్టీప్లై ఫేస్ మాస్కులు ఫాస్ట్ ట్రాక్ కోవిడ్-19 నిధుల నుంచి నిధులను సమకూర్చిన బిరాక్
Posted On:
10 JUN 2021 9:10AM by PIB Hyderabad
హైదరాబాద్ కు చెందిన పరిశోధనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ 95 రెస్పిరేటర్‌కు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ ముల్టీప్లై ఫేస్ మాస్కులను అభివృద్ధి చేసింది. కోవిడ్-19 వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా హైబ్రిడ్ ముల్టీప్లై ఫేస్ మాస్కులు మరింత రక్షణ కల్పిస్తాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 నుంచి రక్షణ పొందడానికి సానిటైజర్లు, పేస్ మాస్కుల వినియోగం పెరిగింది. సానిటైజర్లు, పేస్ మాస్కులను ఉపయోగిస్తూ కోవిడ్ అనుగుణ ప్రవర్తనను అలవరచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. ఎన్ 95 పేస్ మాస్కులు ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తున్నాయి. అయితే, వీటిని ఉతకడానికి వీలులేకపోడంతో పాటు వినియోగించేవారు అసౌకర్యానికి గురవుతున్నారు.
ఎన్ 95 మాస్కులకు ప్రత్యామ్నాయంగా పరిశోధనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పత్తితో చేసిన హైబ్రిడ్ ముల్టీప్లై ఫేస్ మాస్కులను అభివృద్ధి చేసింది. ఎస్‌హెచ్‌జి -95 ® (బిలియన్ సోషల్ మాస్క్‌లు) అభివృద్ధి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోవిడ్-19 నిధుల నుంచి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్), ఐకేపీ నాలెడ్జ్ పార్క్ సహకరించాయి. ఈ 'మేడ్ ఇన్ ఇండియా' పేస్ మాస్కులు రేణువులను (> 90%) మరియు బ్యాక్టీరియా(> 99%) వడపోత సామర్థ్యాన్నికలిగి ఉంటాయి. చేతితో చేసిన పత్తిని ఉపయోగించి చెవులకు సులువుగా తగిలించుకొనేవిధంగా గాలిని పీల్చుకునే విధంగా వీటిని తయారుచేస్తున్నారు. వీటిలో ప్రత్యేకంగా గాలిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా లేయర్ ను ఏర్పాటు చేసి మరో ప్రత్యేకతను కల్పించారు. అందరికి అందుబాటులోవిధంగా ఉతికి లేక కడిగి శుభ్రం చేసుకుని తిరిగి వినియోగించడానికి వీలుగా ఉండే ఈ ఫేస్ మాస్క్‌ల ధర 50-75 రూపాయల వరకు ఉంటుందని సంస్థ అంచనా వేసింది.
ఇంతవరకు 145000కి పైగా మాస్కులను విక్రయించారు. గ్రాండ్ ఛాలెంజెస్ కెనడా కూడా దీనికి నిధులను సమకూర్చింది. కోవిడ్-19 నేపథ్యంలో మాస్కులకు పెరుగుతున్న గిరాకీని తీర్చడంతోపాటు అనేక స్వయం సహాయక బృందాలకు ఈ ప్రాజెక్ట్ పని కల్పిస్తుంది. పరిశోధనలతో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ అందరి అందుబాటులో ఉండే విధంగా ఉత్పత్తులను సాగించడానికి చర్యలు తీసుకుంటున్నామని సంస్థ తెలిపింది.
మరిన్ని వివరాలకు
సంప్రదించవచ్చును.
డిబిటి గురించి
భారతదేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధి చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద, బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) కృషి చేస్తున్నది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం మరియు పరిశ్రమలలో బయో టెక్నాలజీ వినియోగాన్ని అభివృద్ధిని డిబిటి ప్రోత్సహిస్తున్నది.
బిరాక్ గురించి
లాభాపేక్ష లేని విభాగంగా బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్)ని భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగం (డిబిటి)ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేసింది.దేశ అవసరాలకు అనుగుణంగా బయోటెక్నాలజీలో వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి బిరాక్ సహాయ సహకారాలను అందిస్తున్నది.
పరిశోధన టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి లిమిటెడ్ .
ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పరిశోధన టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ ఏర్పాటు అయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా పరిశోధన టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ జూన్ 2016 లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదు చేయబడింది. భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి సంస్థ శిక్షణ పొందిన నిపుణులను కలిగి అంతర్జాతీయ సహకారాన్ని పొందుతున్నది.
***
(Release ID: 1725935)
Visitor Counter : 265