ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకాలపై అపోహల తొలగింపు

జూన్ 2 వరకూ తమిళనాడుకు కోటికి పైగా టీకా డోసుల పంపిణీ
ఇంకా ఆ రాష్ట్రం దగ్గర 7.24 లక్షల డోసులు పంపిణీకి అందుబాటు

జూన్ 15-30 మధ్య తమిళనాడుకు కేంద్రం 18.36 లక్షల ఉచిత డోసులు

18-44 వయోవర్గం కోసం 16.83 లక్షల డోసులు కొనుక్కునే వెసులుబాటు

Posted On: 03 JUN 2021 5:51PM by PIB Hyderabad

కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్టాలు, కేంద్రం చేస్తున్న కృషిలో చేపట్టిన టీకాల కార్యక్రమం జనవరి 16 నుంచి సమర్థవంతంగా సాగుతోంది. టీకా డోసులు సమర్థంగా అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు తీకా మందు తయారీదారులతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మే 1 నుంచి స్వయంగా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

అయితే, తమిళనాడులో టీకా మందు కొరత ఉన్నట్టు కొన్ని మీడియా వార్తలు వెలువడ్డాయి. ఇవి నిరాధారమైన, వాస్తవ దూరమైన వార్తలని తెలియజేస్తున్నాం.

2021 జూన్ 2 నాటికి కోటికి పైగా టీకా డోసులు తమిళనాడుకు అందజేయటం జరిగింది. అందులో 93.3 లక్షల డోసులు వినియోగించుకోగా ప్రస్తుతం ఇంకా 7.24 లక్షల డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. జూన్ నెల రెండు పక్షాల్లో ఉచితంగా పంపిణీ చేయటానికి అందుబాటులో ఉండే టీకాల సమాచారాన్ని కూడా ఇప్పటికే తమిళనాడుకు తెలియజేశాం. జూన్1 నుంచి 15 వరకు మొత్తం 7.48 లక్షల టీకా డోసులు తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అవే కాకుండా జూన్ 16 నుంచి 30 దాకా అదనంగా మరో 18.36 లక్షల డోసులను కూడా కేంద్రం ఉచితంగా సమకూర్చుతోంది.  

అందుబాటులో ఉన్న టీకా డోసులను బట్టి, ఒక్కో రాష్ట్రం సగటు వినియోగాన్నిబట్టి ఈ కేటాయింపు జరుగుతున్నట్టు కూడా కేంద్రప్రభుత్వం తెలియజేసింది. మే 1 నుంచి చేపట్టిన  వేగవంతపు చేసిన టీకాల కార్యక్రమంలో భాగంగా 18-44 వయోవర్గం కోసం చేసిన ఏర్పాట్ల గురించి కూడా తమిళనాడుకు సమాచారం అందించారు. ఈ దశకోసం జూన్ నెలకు 16.83 లక్షల డోసులు అందుబాటులో ఉంటాయి.  

 

*****



(Release ID: 1724224) Visitor Counter : 152