విద్యుత్తు మంత్రిత్వ శాఖ
12వ చీఫ్ ఎనర్జీ మినిస్టీరియల్‌లో పారిశ్రామిక ఇంధన సామర్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు నూతన సాధనాన్ని ప్రారంభించిన భారత్, యుకె
హరిత సాంకేతికతలను ప్రవేశపెట్టి, స్వల్ప కార్బన్ గల పారిశ్రామిక పదార్ధాలకు డిమాండ్‌ను ప్రేరేపించడం ప్రభుత్వ లక్ష్యం
Posted On:
03 JUN 2021 12:47PM by PIB Hyderabad
చీఫ్ ఎనర్జీ మినిస్టీరియల్ (సిఇఎం) 12వ సమావేశంలో యుఎన్ఐడిఒ సమన్వయంతో ఎనర్జీ (కాలుష్యం వెలువరించని, పునరావృత ఇంధనాలు) మంత్రిత్వ శాఖల (సిఇఎం) కింద యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో కలిసి పారిశ్రామిక ఇంధన సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి - పరిశ్రమలలో తీవ్రమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే చొరవ అయిన ఇండస్ట్రియల్ డీప్ డీకార్బొనైజేషన్ ఇనిషియేటివ్ (ఐడిడిఐ) నూతన పని సాధనాన్ని ప్రారంభించింది. 12వ సిఇఎం మే31న ప్రారంభమైంది, 6 జూన్ 2021వరకు కొనసాగనుంది.
ఐడిడిఐ చొరవకు జర్మనీ, కెనెడా మద్దతు పలుకగా, త్వరలోనే మరిన్ని దేశాలు ఇందులో చేర్తాయని అంచనా. ఈ చొరవ లక్ష్యం హరిత సాంకేతికతలను ప్రోత్సహించి, తక్కువ కార్బన్ కలిగిన కార్బన్ కలిగిన పారిశ్రామిక పదార్ధాలకు డిమాండ్‌ను ప్రేరేపించడం.
విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ మాట్లాడుతూ, 2030 నాటికి భారత దేశం ప్రతి జిడిపి యూనిట్‌కు 33 నుంచి 35 శాతం మేరకు ఉద్గారాలను తగ్గించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.
ఇనుము, ఉక్కు, సిమెంటు, పెట్రోకెమికల్స్ వంటి అత్యధిక ఇంధనం అవసరమయ్యే రంగాల్లో స్వల్ప కార్బన్ సాంకేతికతలను ప్రభావవంతంగా మోహరించడంపై ఈ హామీ ఆధారపడి ఉంది. డిమాండ్ ఉన్నరంగాలలో ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇంధన ఆదా చోటు చేసుకుందని ఆయన విస్తారంగా వివరించారు.
***
(Release ID: 1724038)
Visitor Counter : 224