రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కోవిడ్-19 చికిత్స ఔషధాల సరఫరా-డిమాండ్ సమతుల్యతను నిర్ధారిస్తుంది


98.87 లక్షల రెమ్‌డెసివిర్ వయల్స్ ఏప్రిల్ 21 నుండి 30 మే 21 వరకు రాష్ట్రాలు / యుటిలు, కేంద్ర సంస్థలకు కేటాయింపు

పది రెట్లు పెరిగిన రెమ్‌డెసివిర్ ఉత్పత్తి

2021 మే 11 నుండి 30 మే 2021 వరకు రాష్ట్రాలు / యుటిలు మరియు కేంద్ర సంస్థలకు 2,70,060 యాంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు

కోవిడ్-19 సంబంధిత ఔషధాల లభ్యతపై నిరంతర సమీక్ష

Posted On: 01 JUN 2021 4:48PM by PIB Hyderabad

దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్స ఔషధాల సరఫరా-డిమాండ్ సమతుల్యత స్థిరీకరణ అయిందని కేంద్ర మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ అన్నారు.

మొత్తం 98.87 లక్షల రెమ్డెసివిర్ వయల్స్ ని 2021 ఏప్రిల్ 21 నుండి మే 30 వరకు రాష్ట్రాలు, యుటిలు, కేంద్ర సంస్థలకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 'ఉత్పత్తి వేగవంతం చేసి జూన్ చివరి వరకు 91 లక్షల వయల్స్ ను సరఫరా చేయాలని మేము యోచిస్తున్నాము. 2021 ఏప్రిల్ 25 నుండి మే 30 వరకు సిప్లా 400 మిల్లీగ్రాముల 11,000 వయల్స్, 80 మిల్లీగ్రాముల టోసిలిజుమాబ్ 50,000 వయల్స్ ను దిగుమతి చేసుకున్నాం. అంతేకాకుండా, జూన్ లో 80 మిల్లీగ్రాముల 20,000 వయల్స్, 200 మిల్లీగ్రాముల 1000 వయల్స్ వచ్చే అవకాశం ఉంది' అని కేంద్ర మంత్రి వెల్లడించారు. 

2021 మే 11 నుండి మే 30 వరకు 2,70,060 ఆంఫోటెరిసిన్-బి వయల్స్ రాష్ట్రాలు / యుటిలు, కేంద్ర సంస్థలకు కేటాయించినట్లు శ్రీ గౌడ తెలిపారు. మే మొదటి వారంలో తయారీదారులు రాష్ట్రాలకు తయారు చేసిన 81651 వయల్స్  సరఫరాకు అదనం. 

కోవిడ్ చికిత్సలో ఉపయోగించే ఇతర ఔషధాలు డెక్సామెథాసోన్, మిథైల్ప్రెడ్నిసోలోన్, ఎనోక్సపారిన్, ఫావిపిరవిర్, ఐవర్మెక్టిన్, డెక్సామెథాసోన్ టాబ్లెట్ల ఉత్పత్తి, సరఫరా, నిల్వలను కూడా వారానికొకసారి సమీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తిని పెంచి, డిమాండ్ ను ఎదుర్కోడానికి నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. 

కోవిడ్ -19 చికిత్సా ఔషధాల లభ్యతను ప్రస్తుత తయారీదారులు, కొత్త తయారీదారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీ గౌడ స్పష్టం చేశారు.

*****



(Release ID: 1723545) Visitor Counter : 164