ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తగ్గుతున్నధోరణి కొనసాగిస్తూ రోజువారీ కోవిడ్ కేసులు 1.65 లక్షలకు తగ్గుదల;


గత 46 రోజుల్లో ఇదే అత్యల్పం

గత 24 గంటల్లో 1,14,216 తగ్గిన చికిత్సలోని కేసులు; ప్రస్తుతం 21,14,508

వరుసగా 17వ రోజుకూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ;

కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 91.25% కు చేరిక;

రోజువారీ పాజిటివిటీ 8.02%; ఆరు రోజులుగా 10% లోపే;

పరీక్షల సామర్థ్యం పెంపు; ఇప్పటిదాకా 34.3 కోట్ల పరీక్షలు;
గత 24 గంటల్లో 30.35 లక్షలకు పైగా టీకాల పంపిణీ

Posted On: 30 MAY 2021 10:28AM by PIB Hyderabad

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గుదల బాటలో సాగుతోంది. గత 24 గంటలలో మరింత తగ్గి ప్రస్తుతం 21,14,508 కేసులున్నాయి. గత 24 గంటలలో నికరంగా 1,14,216 మంది చికిత్సలో ఉన్నవారు తగ్గారు. ప్రస్తుతం వీరి సంక్య మొత్తం పాజిటివ్ కేసులలో  7.58% మాత్రమే.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YSEL.jpg

రోజువారీ కేసులు తగ్గుతూ ఉండగా వరుసగా మూడు రోజులుగా దేసంలో నమోదవుతున్న కొత్త కేసులు 2 లక్షలలోపే ఉంటున్నాయి. గత 24 గంటలలో  1,65,553 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021QRA.jpg

రోజువారీ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఈ ధోరణి గత 17 రోజులుగా కొనసాగుతోంది. గత 24 గంటలలో 2,76,309 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో కొత్త కేసులకంటే కోలుకున్నవారు 1,10,756 మంది ఎక్కువ.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UZQA.jpg

సంక్షోభం ప్రారంభం నుంచి  ఇప్పటివరకు 2,54,54,320 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, గత 24 గంటలలో  2,76,309 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 91.25% కు చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004BQN2.jpg

గత 24 గంటలలో  20,63,839 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా 34.31 కోట్ల పరీక్షలు జరిపినట్టయింది. దేశవ్యాప్తంగా పరీక్షలు పెరుగుతున్నకొద్దీపాజిటివిటీ తగ్గుతోంది. వారపు పాజిటివిటీ 9.36%  ఉండగా రోజువారీ పాజిటివిటీ నేడు 8.02% కు చేరింది. వరుసగా 6 రోజులుగా ఇది  10% లోపు ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GM2Z.jpg

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలు 21.20 కోట్లు దాటాయి. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 30,07,831 శిబిరాల ద్వారా 21,20,66,614 టీకా డోసులిచ్చారు. గత 24 గంటలలో 30.35 లక్షలకు పైగా  (30,35,749) టీకాడొసులిచ్చారు. అందులో:

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,62,777

రెండో డోస్

67,72,792

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,55,59,932

రెండో డోస్

84,89,241

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,83,43,505

రెండో డోస్

9,429

45 -60 వయోవర్గం

మొదటి డోస్

6,54,11,045

రెండో డోస్

1,05,27,297

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,84,40,218

రెండో డోస్

1,86,50,378

మొత్తం

21,20,66,614

 

 

****



(Release ID: 1722859) Visitor Counter : 159