పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎన్.పి.ఎన్.టి అనువర్తిత డ్రోన్‌కార్యకలాపాలకు సంబంధించి 166 అదనపు గ్రీన్ జోన్ స్థలాలకు ఆమోదం
Posted On:
29 MAY 2021 4:01PM by PIB Hyderabad
నో పర్మిషన్ - నో టేకాఫ్ నిబంధనల అనువర్తిత డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించి కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అదనంగా 166 గ్రీన్ జోన్‌లకు అనుమతి మంజూరు చేసింది. దేశంలో డ్రోన్ కార్యకలాపాలను సజావుగా సాగేలా చేయడానికి వీలుగా , అలాగే డ్రోన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారరు. ఇప్పుడు కొత్తగా అనుమతించిన జోన్లు గతంలో అనుమతించిన 66 గ్రీన్ జోన్‌లకు అదనంగా వచ్చినవి. కొత్తగా అనుమతించి గ్రీన్ జోన్ ప్రదేశాలను డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్ (https://digitalsky.dgca.gov.in) లో చూడచ్చు.
డిజిసిఎ ఆదేశాల ప్రకారం, ఎన్ పి ఎన్ టి (నో పర్మిషన్ - నో టేకాఫ్) నిబంధనల అనువర్తింపుతో ప్రతి నానో మినహా రిమోట్‌లీ పైలెటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ల విషయంలో డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం ద్వారా దేశంలో వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఈ ఫ్రేమ్ వర్క్ క్రింద ఈ సదుపాయాన్ని వినియోగించుకునేవారు తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. ఈపోర్టల్ రిమోట్ లీ పైలెటెడ్ ఎయిర్ క్రాఫ్ట్‌కు సంబంధింఇ జాతీయ మానవ రహిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ గా వ్యవహరిస్తుంది. ఈ ఆమోదిత గ్రీన్ జొన్‌లలో ఆయా డ్రోన్లు ఎగరాలంటే డిజిటల్ స్కై పోర్టల్ లేదా యాప్ ద్వారా సమయం, లొకేషన్‌కు సంబంధించి ముందస్తు సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది.
డ్రోన్ ప్లైట్స్ గ్రీన్ జోన్‌లో ఎగిరేటపుడు అవి 2021 మార్చి 12 నాటి అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ (యుఎఎస్) రూల్స్ 2021 ను, పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆదేశాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఆమోదం పొందిన గ్రీన్ జోన్ ప్రదేశాలకు సంబంధించిన జాబితా కింద చూడవచ్చు.
రాష్ట్రం,
|
ప్రదేశాల సంఖ్య
|
ఆంధ్రప్రదేశ్,
|
04
|
ఛత్తీస్‌ఘడ్
|
17
|
గుజరాత్
|
02
|
జార్ఖండ్
|
30
|
కర్ణాటక
|
06
|
మధ్యప్రదేశ్
|
24
|
మహారాష్ట్ర
|
22
|
ఒడిషా
|
30
|
పంజాబ్
|
01
|
రాజస్థాన్
|
06
|
తమిళనాడు
|
07
|
తెలంగాణ
|
09
|
ఉత్తరప్రదేశ్
|
08
|
ఆమోదం పొందిన ప్రదేశాల గ్రీన్ జోన్ల పేర్ల జాబితా కోసం క్లిక్ చేయండి.
***
(Release ID: 1722828)
Visitor Counter : 241