ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ అప్‌డేట్‌

Posted On: 29 MAY 2021 9:17AM by PIB Hyderabad

రోజువారీ 1.73 ల‌క్ష‌ల కొత్త కేసుల వ‌ద్ద కోత్త కేసుల‌లో ప‌త‌నద‌శ నమోదైంది.
గ‌డ‌చిన 45 రోజులతో పోల్చిన‌పుడు త‌క్కువ కేసుల న‌మోదు
క్రియాశీల కేస్‌లోడ్ మ‌రింత‌గా త‌గ్గి 22, 28,724 కు చేరింది.
క్రియాశీల కేసులు గ‌త 24 గంట‌ల‌లో 1,14,428కి త‌గ్గాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 2,51,78,011 కు చేరింది.
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న పేషెంట్ల సంఖ్య 2,84,601
రోజువారీ రిక‌వ‌రీలు వ‌రుస‌గా 16 వ రోజు కూడా కొత్త కేసుల కంటే ఎక్కువ‌గా ఉన్నాయి.
రిక‌వ‌రీ రేటు 90.80 శాతానిక పెరుగుద‌ల‌
వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 9.84 శాతం
రోజువారీ పాజిటివిటి రేటు 8.36 శాతం. ఇది వ‌రుస‌గా 5 వ రోజు 10 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
ఇప్ప‌టివ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా వ‌క్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద 20.89 కోట్ల వాక్సిన్‌డోస్‌లు వేయ‌డం జరిగింది.
కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యం గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కూ 34.1 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

***



(Release ID: 1722639) Visitor Counter : 112