ప్రధాన మంత్రి కార్యాలయం
యాస్ చక్రవాతం ప్రభావాన్ని సమీక్షించడం కోసం ఒక సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి
ఎన్ డిఆర్ఎఫ్ కు చెందిన 106 బృందాల ను రంగం లోకి దించడమైంది
సాధ్యమైనంత త్వరలో సామాన్య జన జీవనాన్ని పునరుద్ధరించేందుకు హామీ ని ఇవ్వాలి: ప్రధాన మంత్రి
Posted On:
27 MAY 2021 3:50PM by PIB Hyderabad
యాస్ చక్రవాతం ప్రభావాన్ని సమీక్షించడం కోసం జరిగిన ఒక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం లో అధికారులు యాస్ చక్రవాతాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన సన్నాహాల తాలూకు వివిధ దశల ను గురించే కాకుండా, తుఫాను వల్ల వాటిల్లిన నష్టాల తాలూకు అంచనా తో పాటు సంబంధిత అంశాల తో కూడిన ఒక సమగ్ర నివేదిక ను కూడా సమర్పించారు.
ఈ క్రమం లో, ఎన్ డిఆర్ఎఫ్ కు చెందిన సుమారు 106 బృందాల ను పశ్చిమ బంగాల్ లోను, ఒడిశా లోను చెరి 46 బృందాల చొప్పున విస్తరించడం జరిగిందని, ఆయా బృందాలు 1000 మంది కి పైగా వ్యక్తుల ను కాపాడడం తో పాటుగా, విరిగిపడిపోయి రహదారుల లో రాక పోకల ను ఆటంకపరచిన 2500 కు పైగా వృక్షాల ను/ స్తంభాల ను తొలగించిన అంశాలు కూడా చర్చ కు వచ్చాయి. తుఫాను లో విభిన్న ప్రదేశాల లో ఒంటరి గా చిక్కుబడిపోయి బయట కు రాలేకపోయిన వ్యక్తుల ప్రాణాల ను సైన్య దళాలు, కోస్తాతీర రక్షకదళాలు రక్షించగా, మరో పక్క నౌకా సేన, వాయు సేన లు కూడా అప్రమత్తం గా వ్యవహరించిన విషయం సమావేశం లో ప్రస్తావన కు వచ్చింది.
యాస్ చక్రవాతం ఫలితం గా సంభవించిన నష్టాల ను మదింపు చేయడం లో రాష్ట్రాలు నిమగ్నం అయినప్పటికీ, ఈసరికే అందిన ప్రాథమిక నివేదికల ను బట్టి చూస్తే, జరుగబోయేదేమిటో కచ్చితమైన ముందుగానే తెలుసుకొని ప్రభావిత ప్రాంతాల లోని ప్రజల కు కట్టుదిట్టమైన సమాచారాన్ని ఇచ్చినందువల్లనూ, కేంద్రీయ ఏజెన్సీ లు, రాష్ట్రాల ఏజెన్సీ లు సకాలం లో ప్రతిస్పందించి నివాసుల ను ఖాళీ చేయించినందువల్లనూ ప్రాణ నష్టం/ వస్తు నష్టం కనీస స్థాయి లో ఉండేటట్టు పూచీపడటం జరిగింది. అదే కాలం లో, నీటి ముంపు కారణం గా వాటిల్లిన నష్టాల ను మదింపు చేయడం జరుగుతోంది. దెబ్బతిన్న ప్రాంతాల లో చాలా వరకు ప్రాంతాల లో విద్యుత్తు, టెలికమ్ సేవల ను పునరుద్ధరించడమైంది.
చక్రవాతం రువ్విన సవాళ్ల కు దీటు గా ప్రతిస్పందించడం లో కేంద్రీయ ఏజెన్సీ లు, రాష్ట్రాల ఏజెన్సీ లు ప్రభావకారియైన పాత్ర ను, సక్రియాత్మకమైన పాత్ర ను పోషించిన సంగతి ని ప్రధాన మంత్రి గమనించారు. దీనితో పాటు చక్రవాతం వల్ల బాధితులైన వ్యక్తుల కు తగిన సహాయాన్ని అందించే దిశ లోను, ప్రభావిత ప్రాంతాల లో సాధ్యపడినంత త్వరలో సాధారణ జీవనాన్ని పునుద్ధరించే దిశ లోను హామీ ని ఇవ్వాలంటూ ఆయా ఏజెన్సీల కు ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు.
ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, హోం సెక్రట్రి, విద్యుత్తు శాఖ కార్యదర్శి, టెలికమ్ కార్యదర్శి, ఐఎమ్ డి డిజి, ఇతర ముఖ్య అధికారులు సమావేశం లో పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1722219)
Visitor Counter : 181
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam