ఉక్కు మంత్రిత్వ శాఖ
యాస్ తుపాను కారణంగా స్టీలు ఉత్పత్తి లేదా ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు
Posted On:
27 MAY 2021 11:54AM by PIB Hyderabad
ఉక్కు తయారీ, ఆక్సిజన్ ఉత్పత్తిపై యాస్ తుపాను ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రధాన ఉక్కు పరిశ్రమలతో అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సహ శాఖతో కలిసి ఉక్కు మంత్రిత్వ శాఖ 23మే న సమావేశాన్ని నిర్ధారించింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ప్లాంట్లు మాత్రమే ప్రభావితమవుతాయని సమావేశం తేల్చింది. కనుక, విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని చర్యలూ తీసుకోవడం జరిగింది. ఒడిషాలోని కళింగనగర్, అంగుల్ ప్లాంట్లపై ఆక్సిజన్ పై ఆధారపడిన రాష్ట్రాలు 2 నుంచి 4 రోజులపాటు తాత్కాలికంగా టాటా జమ్ షడ్పూర్ ప్లాంట్ ను నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, ఒడిషాలోని అంగుల్, కళింగనగర్, రౌర్కేలాలోని స్టీల్ ప్లాంట్లలో ఎటువంటి అంతరాయం కలుగలేదని రూఢి అయింది. ఒడిషాలో ప్లాంట్లు కలిగిన టాటా ప్రతినిధులు యాస్ తుపాను టాటా స్టీల్ ప్లాంట్లలో ఎల్ఎంఒ ఉత్పత్తిపై ఎటువంటి ప్రభావం చూపలేదని ఖరారు చేశారు.
కళింగనగర్, జమషడ్‌పూర్ అంగుల్‌కు అనుబంధంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లనుంచి ఎల్ఎంఒ ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది.
కళింగనగర్ వెడుతున్న ట్యాంకర్ల ను జమ్‌షడ్‌పూర్‌కు మళ్ళించడంతో అటు వెడుతున్న వాటి సంఖ్య తగ్గింది. సంభవించనున్న తుపానును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఇది జరిగింది. దుర్గాపూర్, బర్న్‌పూర్, రౌర్కేలాలో సెయిల్ (SAIL) ప్లాంట్లు కూడా తగినట్టుగా సిద్ధం అయ్యాయి. అటువంటి పరిస్థితులను నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ పద్ధతిని సంబంధితులందరికీ నొక్కి చెప్పడం జరిగింది. స్టీల్ ఉత్పత్తి లేదా ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు. అలాగే, ఒడిషాలోని అంగుల్, ఝార్సుగూడలో ప్లాంట్లు కలిగిన జెఎస్‌పిఎల్, జెఎస్‌డబ్ల్యు కూడా సంసిద్ధంగా ఉండి, యాస్ తుపాను సందర్భంగా ఎటువంటి విధ్వంసాన్ని ఎదుర్కోలేదు.
***
(Release ID: 1722148)
Visitor Counter : 281