ప్రధాన మంత్రి కార్యాలయం

బుద్ధ పూర్ణిమ సందర్భంగా వర్చువల్ మాధ్యమంద్వారా నిర్వహించే ప్రపంచ వైశాఖీ వేడుకల్లో కీలక ప్రసంగం చేయనున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 25 MAY 2021 6:48PM by PIB Hyderabad

బుద్ధ పూర్ణిమ  సందర్భంగా 2021 మే 26వ తేదీన వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించే ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల్లో’’ ఉదయం 9:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.

   అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగాగల బౌద్ధ సంఘాల అత్యున్నత అధిపతులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. దీంతోపాటు ప్రపంచంలోని 50 మందికిపైగా ప్రముఖ బౌద్ధమత పెద్దలు ఈ వేడుకలలో ప్రసంగిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 1721735) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam