విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బయోమాస్ వినియోగంపై జాతీయ మిషన్ నెలకొల్పాలని నిర్ణయించిన విధ్యుత్ మంత్రిత్వశాఖ
Posted On:
25 MAY 2021 11:30AM by PIB Hyderabad
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో జీవపదార్ధాల ( బయోమాస్) వినియోగించే అంశాన్ని పరిశీలించడానికి జాతీయ మిషన్ ను నెలకొల్పాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. వ్యవసాయ వ్యర్ధాలను తగలబెట్టడం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాల వల్ల కలుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బయోమాస్ ను ఉపయోగించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు దేశంలో ఇంధన సరఫరా, స్వచ్ఛమైన ఇంధన వనరులను ఉపయోగంలోకి తేవాలన్న లక్ష్యం నెరవేరుతుంది.
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బయోమాస్ వినియోగంపై ఏర్పాటయ్యే జాతీయ మిషన్ ఈ కింది లక్ష్యాలతో పనిచేస్తుంది.
(i)కర్బన విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 5%వరకు ఉన్న బయోమాస్ వాడకాన్ని సాధ్యమైనంతవరకు ఎక్కువ చేసి తటస్థ విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువ చేయడం
(ii)బయోమాస్ గుళికల్లో సిలికా, ఆల్కలైస్ లను ఎక్కువగా వినియోగించి పనిచేసే బాయిలర్ లను అభివృద్ధి చేసే అంశంలో పరిశోధనా కార్యక్రమాలను చేపట్టడం
(iii) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బయోమాస్ గుళికలు, వ్యవసాయ వ్యర్ధాలను రవాణా చేసే అంశంలో ఎదురవుతున్న సమస్యలను తొలగించడం
(iv) ఇతర ఇంధన పదార్థాలతో కలిపి బయోమాస్ ను వినియోగించే అంశంలో ఉన్న నియంత్రణలను పరిశీలించడం.
జాతీయ మిషన్ ను ఏవిధంగా రూపకల్పన చేయాలి, అది ఎలా పనిచేస్తుంది అన్న అంశాలకు తుదిరూపు ఇచ్చే అంశం పరిశీలనలో ఉంది. మిషన్ కోసం ఇంధనశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. దీనిలో విద్యుత్ ఉత్పత్తి రంగంతో సంబంధం ఉన్న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (మోపిఎన్‌జి), నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఇ) ప్రతినిధులతో సహా అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సీఈఏ సభ్యుడు ( థర్మల్) ఎగ్జిక్యూటివ్ కమిటీ కి అధ్యక్షత వహిస్తారు. అవసరమైన మౌలిక ఇతర సౌకర్యాలను కల్పిస్తూ ప్రతిపాదిత జాతీయ మిషన్ ను ఏర్పాటు చేసే అంశంలో ఎన్‌టిపిసి కీలక పాత్ర పోషిస్తుంది. మిషన్‌లో సిఇఎ, ఎన్‌టిపిసి, డివిసి మరియు ఎన్‌ఎల్‌సి ఇతర సంస్థల నుంచి ఎంపిక చేసిన అధికారులు ఉంటారు. మిషన్ కాల పరిమితి అయిదు సంవత్సరాలుగా ఉంటుంది. మిషన్ లో భాగంగా కింది ఉప గ్రూపులను ఏర్పాటుచేయడం జరుగుతుంది.
(i) ఉప గ్రూప్ 1:బయోమాస్ లక్షణాలు / లక్షణాలపై పరిశోధన చేసే బాధ్యతను కలిగివుంటుంది.
(ii) ఉప గ్రూప్ 2: బాయిలర్ రూపకల్పనలో పరిశోధనతో సహా సాంకేతిక వివరణ మరియు భద్రతా అంశాలను చేపట్టడం. పైలట్ ప్రాజెక్టును నిర్వహించడానికి అధిక మొత్తంలో బయోమాస్‌ను బొగ్గుతో కాల్చడానికి పైలట్ ప్రాజెక్టును నిర్వహించే బాధ్యతను స్వీకరిస్తుంది.
(iii). ఉప గ్రూప్ 3: మిషన్ వ్యవధిలో మరియు సున్నితత్వ కార్యక్రమంలో సరఫరా సమస్యలనుపరిష్కరించే అంశానికి బాధ్యత వహిస్తుంది.
(iv). ఉప గ్రూప్ 4: వ్యవసాయ-ఆధారిత బయోమాస్ గుళికలు మరియు మునిసిపల్ వ్యర్ధ (ఎంఎస్‌డబ్ల్యు) గుళికల పరీక్ష కోసం ప్రయోగశాలలు మరియు ధృవీకరణ సంస్థలను ఎంపిక చేసే బాధ్యతను కలిగి ఉంటుంది.
(v). ఉప గ్రూప్ 5: బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లలో బయోమాస్ వినియోగం దీనికి సంబంధించిన ఆర్ధిక అంశాలపై దృష్టి సారించి పనిచేస్తుంది.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌సిఎపి) లక్ష్యాల సాధనకు బయోమాస్‌పై ప్రతిపాదిత నేషనల్ మిషన్ కూడా దోహదం పడుతుంది.
***
(Release ID: 1721585)
Visitor Counter : 293