రక్షణ మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో కార్యాచరణ సన్నద్ధత, భద్రత పరిస్థితిని సమీక్షించిన సైన్యాధిపతి
Posted On:
21 MAY 2021 8:03AM by PIB Hyderabad
భారత సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె రెండు రోజుల పర్యటన కోసం నాగాలాండ్‌లోని దిమాపూర్ వెళ్లారు. అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో కార్యాచరణ సన్నద్ధత, ఈశాన్య భారతంలోని అంతర్గత ప్రాంతాల్లో భద్రత పరిస్థితిని సమీక్షించారు.
దిమాపూర్‌లోని కార్ప్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సైన్యాధిపతికి, ఉత్తర సరిహద్దుల్లో కార్యాచరణ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితిని లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ మాథ్యూ, డివిజినల్ కమాండర్లు వివరించారు.
అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నందుకు అధికారులందరినీ అభినందించిన సైన్యాధిపతి, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాధీన రేఖ వెంబడి జరిగే కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
జనరల్ ఎం.ఎం.నరవణె శుక్రవారం తిరిగి దిల్లీకి చేరుకుంటారు.
***
(Release ID: 1720689)
Visitor Counter : 185