రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

యాంఫోటెరిసిన్-బి కొరత త్వరలోనే తీరుతుంది- శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ


దేశీయంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు మూడు రోజుల్లోనే కొత్తగా 5 సంస్థలకు అనుమతి

ఆరు లక్షల వయళ్ల యాంఫోటెరిసిన్‌-బి దిగుమతి కోసం ఆర్డర్లు పంపిన భారతీయ సంస్థలు

Posted On: 20 MAY 2021 7:03PM by PIB Hyderabad

దేశంలో యాంఫోటెరిసిన్-బి కొరత త్వరలోనే తీరుతుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. మ్యూకోర్‌మైకోసిస్‌ చికిత్స కోసం యాంఫోటెరిసిన్‌-బి ఔషధాన్ని ఉపయోగిస్తారు.

https://twitter.com/mansukhmandviya/status/1395366089916260352?s=20

    దేశీయంగా యాంఫోటెరిసిన్‌-బి ఉత్పత్తిని ప్రారంభించేందుకు మూడు రోజుల్లోనే కొత్తగా 5 సంస్థలకు అనుమతి వచ్చిందని, ఇప్పటికే 6 సంస్థలకు అనుమతి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సంస్థలు ఉత్పత్తి కూడా పెంచాయని తెలిపారు.

    ఆరు లక్షల వయళ్ల యాంఫోటెరిసిన్‌-బి దిగుమతి కోసం భారతీయ సంస్థలు విదేశాలకు ఆర్డర్లు పంపాయని శ్రీ మాండవీయ వెల్లడించారు.

    పరిస్థితిని చక్కదిద్దడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని కేంద్ర మంత్రి వివరించారు.

***



(Release ID: 1720474) Visitor Counter : 150