ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ సహాయంపై తాజా సమాచారం


అంతర్జాతీయ సహాయాన్ని అత్యంత వేగంగా రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్రం

ఇప్పటిదాకా 11,000 కు పైగా ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; దాదాపు16,000 పైగా ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6,800 వెంటిలేటర్లు; దాదాపు 6.1 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్ల పంపిణీ

Posted On: 18 MAY 2021 5:00PM by PIB Hyderabad

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నివారణ దిశలో భారత్ చేస్తున్న కృషికి తోడుగా ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలు, సంస్థలు పంపుతున్న విరాళాలు, సహాయ సామగ్రిని భారత ప్రభుత్వం  ఏప్రిల్ 27 నుంచి అందుకుంటోంది.

ఏప్రిల్ 27 నుంచి మే 17 దాకా మొత్తం 11325 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 15,801 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 8,526 వెంటిలేటర్లు; దాదాపు 6.1 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా, గిలియాడ్ ( యు ఎస్ ఎ), ఇండో-స్విస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అందిన ప్రధాన సహాయ సమాగ్రి ఇలా ఉంది:

 

సామగ్రి

పరిమాణం

వెంటిలేటర్లు

1056

రెమిడిసివిర్

                          57,893

 

*అదనంగా మాస్కులు కూడా అందాయి.

 

ఫొటో 1. కోవిడ్ బాధితులకోసం విదేశీ సాయంగా అందిన పరికరాలు ఎలా ఉపయోగపడతాయో మాట్లాడుతున్న గుజరాత్ లోని ధార్పూర్ పఠాన్ జి ఎం ఇ ఆర్ ఎస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనీష్ రామ్ వత్.

[డిడి న్యూస్ ట్విట్టర్ లింక్ https://twitter.com/DDNewslive/status/1394297327855104010?s=08]

 

ఫొటో 2. విదేశాల నుంచి వచ్చి భారత ప్రభుత్వం ద్వారా అందుకున్న పరికరాలు, మందుల కు ధన్యవాదాలు తెలియజేస్తున్న అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ ఎం. లెగో. 

[డిడి న్యూస్ ట్విట్టర్ లింక్https://twitter.com/DDNewslive/status/1394298469393698817?s=08]

                                                                                                             

ఫొటో 3. స్పెయిన్ నుంచి ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, హ్యుమిడిఫయర్లు, ఆక్సిజెన్ మాస్కులు, ఆక్సిజెన్ నేసల్ ట్యూబ్స్ తో సాయంత్రం సుమారు 5 గంటలకు వచ్చిన ఫ్లైట్ నెం. ఎస్వీ 760

[డిడి న్యూస్ ట్విట్టర్ లింక్https://twitter.com/DDNewslive/status/1394285112552951808?s=08]

 

తక్షణమే సమర్థవంతంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించటం, పంపిణీ చేయటం అన్నవి అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది.  మంత్రిత్వశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ సహాయాన్ని అందుకోవటం, దాన్ని పంపిణీ చేయటం లాంటివి పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ విభాగం పనిచేయటం ప్రారంభమైంది. మే 2వ తేదీ నుంచి ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించి అమలు చేస్తోంది.   

 

*****


(Release ID: 1719788) Visitor Counter : 213