రైల్వే మంత్రిత్వ శాఖ

ఒక్క రోజులో గ‌రిష్ఠంగా వెయ్యి మెట్రిక్ ట‌న్నులకు పైగా ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేసిన ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు

11,030 మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా ఆక్సిజ‌న్ 13 రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా

521 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మ‌హారాష్ట్ర‌కు , 2858 మెట్రిక్ ట‌న్నులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు, 476 మెట్రిక్ ట‌న్నులు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు , 1427 మెట్రిక్ ట‌న్నులు హ‌ర్యానాకు, 565 మెట్రిక్ ట‌న్నులు తెలంగాణాకు , 40 మెట్రిక్ ట‌న్నులు రాజ‌స్థాన్‌కు, 480 మెట్రిక్ ట‌న్నులు క‌ర్ణాట‌క‌కు, 200 మెట్రిక్ ట‌న్నులు ఉత్త‌రాఖండ్‌కు 350 మెట్రిక్ ట‌న్నులు త‌మిళ‌నాడుకు ,పంజాబ్‌కు 81 మెట్రిక్ ట‌న్నులు, కేర‌ళ‌కు 118 మెట్రిక్ ట‌న్నులు ఢిల్లీకి 3794 మెట్రిక్ ట‌న్నులు ర‌వాణా చేయ‌డం జ‌రిగింది.

Posted On: 18 MAY 2021 3:22PM by PIB Hyderabad

వివిధ అడ్డంకులను అధిగ‌మిస్తూ , ఎప్ప‌టిక‌ప్పుడు వినూత్న ప‌రిష్కారాల‌ను క‌నుగొంటూ  భార‌తీయ రైల్వే దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్ (ఎల్‌.ఎం.ఒ)ను స‌ర‌ఫ‌రాచేస్తూ ఆయా రాష్ట్రాల‌కు పెద్ద ఊర‌ట క‌లిగిస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ రైల్వే 675కు పైగా ట్యాంక‌ర్ల  ద్వారా 11,030 మెట్రిక్ ట‌న్నుల ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసింది.
ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు గ‌త కొద్ది రోజులుగా సుమారు 800 మెట్రిక్ ట‌న్నుల ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను  అందిస్తున్నాయి.


ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ లు   23 రోజుల క్రితం ఏప్రిల్ 24 న మ‌హారాష్ట్ర‌నుంచి 126 మెట్రిక్ ట‌న్నుల లోడ్‌తో  ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ప్రారంభించాయి.
ప‌ట్టుమ‌ని 24 రోజుల వ్య‌వ‌ధిలో రైల్వే ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ కార్య‌క‌లాపాల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టి 11,030 మెట్రిక్ ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను 13 రాష్ట్రాల‌కు అందించింది.

భార‌తీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి ఆక్సిజ‌న్‌ను స‌మీక‌రించి ఆయా గ‌మ్య‌స్థానాల‌కు చేరుస్తున్న‌ది. ప‌శ్చిమాన హ‌పా, ముంద్రానుంచి అలాగే తూర్పున రూర్కేలా, దుర్గాపూర‌ర్‌, టాటాన‌గ‌ర్‌, అంగుల్‌నుంచి ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను సేక‌రించి దానిని ఉత్త‌రాఖండ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఎం.పి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, తెలంగాణా, పంజాబ్‌, కేర‌ళ‌, ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. సంక్లిష్ట‌మైన మార్గాల‌లోనూ ఇది త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది..


ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వీలైనంత స‌త్వ‌రం జ‌ర‌రిగేందుకు వీలుగా రైల్వే వినూత్న ప్ర‌మాణాల‌ను రూపొందించింది. అలాగే మున్నెన్న‌డూ లేనివిధంగా ఆక్సిజ వేన్ ఎక్స్‌ప్రెస్ ర‌వాణా రైల్ళ‌కు ప్ర‌మాణాల‌ను నిర్దేశించుకుని వాటిని న‌డుపుతున్న‌ది. ఈ ఆక్సిజ‌న్ ర‌వాణా రైళ్ల స‌గ‌టు వేగం చాలావ‌ర‌కు దూర‌ప్రాంత ర‌వాణాకు 55పైనే ఉంది. అధిక ప్రాధాన్య‌త‌గ‌ల గ్రీన్ కారిడార్‌లో అత్య‌ధిక అత్య‌వ‌స‌ర పంపిణీని దృష్టిలో ఉంచుకుని వివిధ రైల్వే జోన్ల‌లోని నిర్వ‌హణా బృందాలు  అనుక్ష‌ణం అప్ర‌మ‌త్త‌తో ప‌నిచేస్తున్నాయి. వీలైనంత త్వ‌ర‌గా ఆక్సిజ‌న్‌ను వేగంగా అందించేందుకు ఈ బృందాలు కృషి చేస్తున్నాయి. వివిధ సెక్షన్ల‌లో  సిబ్బంది మార్పు కోసం సాంకేతిక నిలుపుద‌ల‌లు 1 నిమిషం క‌న్న త‌క్కువ‌కు త‌గ్గించ‌డం జ‌రిగింది..


ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు ఎలాంటి అంత‌రాయం లేకుండా ముందుకు  సాగిపోవ‌డానికి వీలుగా ట్రాక్‌ల‌ను ఖాళీగా ఉంచ‌డానికి అత్యంత అప్ర‌మ‌త్త‌తతో చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌రోవైపు ఇత‌ర స‌ర‌కు ర‌వాణా కార్య‌క‌లాపాల వేగం ఏమాత్రం త‌గ్గించకుండా ఇదంతా చేయ‌డం జ‌రిగింది.
.
ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 175 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు త‌మ ప్ర‌యాణాన్ని ముగించుకుని వివిధ రాష్ట్రాల‌కు ఊర‌ట నిచ్చాయి.


ఆక్సిజ‌న్‌ను కోరుతున్న రాష్ట్రాల‌కు స్వ‌ల్ప‌వ్య‌వ‌ధిలో వీలైనంత ఎక్కువ ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు భార‌తీయ రైల్వే కృషి చేస్తున్న‌ది. ఉ
ఈ స‌మాచారం అందించే స‌మ‌యానికి మ‌హారాష్ట్ర‌కు 521 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు 2858 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు 476 మెట్రిక్‌ట‌న్నులు,  హ‌ర్యానాకు 1427 మెట్రిక్ ట‌న్నులు, తెలంగాణాకు 565 మెట్రిక్ ట‌న్నులు, రాజ‌స్థాన్‌కు 40 మెట్రిక్ ట‌న్నులు, క‌ర్ణాట‌క‌కు 480 మెట్రిక్ ట‌న్నులు, ఉత్త‌రాఖండ్‌కు 200 మెట్రిక్ ట‌న్నులు, త‌మిళ‌నాడుకు 350 మెట్రిక్ ట‌న్నులు, పంజాబ్‌కు 81 మెట్రిక్ ట‌న్నులు, కేర‌ళ‌కు 118 మెట్రిక్ ట‌న్నులు, ఢిల్లీకి 3794 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను అందించింది.

ఆక్సిజ‌న్‌ను తీసుకెళ్ల‌డం చాలా డైన‌మిక్ వ్య‌వ‌హారం. ఇందుకు సంబంధించిన గ‌ణాంకాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి.  ఎక్కువ లోడ్ క‌లిగిన ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌లు త‌మ ప్ర‌యాణాన్ని రాత్రిపొద్దుపోయాక‌ ప్రారంభిస్తుంటాయి.
ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా లొకేష‌న్ల‌కు సంబంధించి రైల్వే వివిధ రూట్ల‌ను, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా లొకేష‌న్ల‌ను గుర్తించింది. దీనితో ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉన్న రాష్ట్రం అవ‌స‌రం తీర్చ‌డానికి రైల్వే సిద్థంగా ఉంది. ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను తీసుకు వచ్చేందుకు రాష్ట్రాలు భార‌తీయ రైల్వేకి ట్యాంక‌ర్లు స‌మ‌కూరుస్తాయి.

 

***

 


(Release ID: 1719712) Visitor Counter : 257