వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పీఎం జీకే కింద కేటాయించిన ఆహారధాన్యాల మే 2021 కోటాను 100% తీసుకున్న 16 రాష్ట్రాలు/యూటీలు


పీఎం జీకే కింద రాష్ట్రాలు/ యూటీలకు 31.80 లక్షల ఎంటీల ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేసిన భారత ఆహార సంస్థ

పీఎం జీకే కేటాయింపులను తీసుకుంటున్న 36 రాష్ట్రాలు/ యూటీలు

Posted On: 18 MAY 2021 4:23PM by PIB Hyderabad

కరోనా వైరస్ వల్ల ఆర్ధికంగా దెబ్బతిని సమస్యలను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎం జీకే)

కింద అందుతున్న ఆహారధాన్యాలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రతాలు అర్హులైనవారికి సరఫరా చేస్తున్నాయి. 

2021 మే 17వ తేదీ నాటికి అన్ని 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు భారత ఆహార సంస్థ గిడ్డంగుల నుంచి 31.80 లక్షల ఎంటీల ఆహారధాన్యాలను తీసుకున్నాయి. మే, జూన్ నెలల కేటాయింపులను లక్ష దీవులు పూర్తిగా తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, ఛత్తీస్ ఘర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, లడఖ్, మేఘాలయ,మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ త్రిపురలు 2021 మే కేటాయింపులను పూర్తిగా తరలించాయి. పీఎం జీకే కేటాయింపులను అర్హులైన లభ్డిదారులకు అందించడానికి రాష్ట్రాలు/ యూటీలు చర్యలను తీసుకుంటున్నాయి. 

ఈ పథకం కింద  ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలోకి వచ్చే79.39 కోట్ల మంది  లబ్ధిదారులకు మనిషికి అయిదు కేజీల చొప్పున వారికి సరఫరా చేయవలసిన మొత్తం కంటే ఎక్కువగా ఆహార ధాన్యాలు ( బియ్యం/గోధుమలు) మే, జూన్ లలో రెండు నెలల పాటు ఉచితంగా అందించనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కింద కేటాయిస్తున్న ఆహారధాన్యాలు అదనంగా 79.39 లక్షల ఎంటీల ఆహారధాన్యాలను కేటాయించడం జరిగింది. రాష్టాలు/యూటీలకు అందిస్తున్న కేంద్ర సహకారం కింద ఆహారధాన్యాల ఖరీదు, రవాణా తదితర అయ్యే 26,000 కోట్ల రూపాయల ఖర్చును కేంద్రం భరించాలని నిర్ణయించింది. 

ఇంతకుముందు, భారత ప్రభుత్వం పిఎమ్‌జికె-I  (ఏప్రిల్-జూన్ 2020) మరియు పిఎమ్‌జికెఎ- II (జూలై-నవంబర్ 2020) కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించింది.  వీటిలో 104 ఎల్‌ఎమ్‌టి గోధుమలు మరియు 201 ఎల్‌ఎమ్‌టి బియ్యం, మొత్తం 305 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను  సంబంధిత రాష్ట్రాలు / యుటిలకు భారత ఆహార సంస్థ సరఫరా చేసింది. 

***



(Release ID: 1719642) Visitor Counter : 186