ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ సహాయంపై తాజా సమాచారం


అంతర్జాతీయ సహాయాన్ని అత్యంత వేగంగా రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్రం

ఇప్పటిదాకా 11,000 కు పైగా ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,500 పైగా ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 7,500 పైగా వెంటిలేటర్లు; దాదాపు 5.3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్ల పంపిణీ

Posted On: 16 MAY 2021 4:34PM by PIB Hyderabad

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నివారణ దిశలో భారత్ చేస్తున్న కృషికి తోడుగా ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలు, సంస్థలు పంపుతున్న విరాళాలు, సహాయ సామగ్రిని భారత ప్రభుత్వం  ఏప్రిల్ 27 నుంచి అందుకుంటోంది. సంపూర్ణ పాలన లక్ష్యంగా అందరికీ ఈ సహాయం ఒక క్రమ పద్ధతిలో అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.  భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ఈ సహాయాన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వెనువెంటనే వేగంగా పంపటంలో సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ఏప్రిల్ 27 నుంచి మే 15 దాకా మొత్తం 11,058 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,496 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 7,365 వెంటిలేటర్లు; దాదాపు  5.3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.

కజకిస్తాన్, జపాన్, స్విట్జర్లాండ్, ఒంటారియో ( కెనడా), యు ఎస్ ఎ,  ఈజిప్ట్, బ్రిటిష్ ఆక్సిజెన్ కంపెనీ (యుకె) నుంచి అందిన ప్రధాన సహాయ సామగ్రి ఇలా ఉంది

·        ఆక్సిజెన్  కాన్సంట్రేటర్లు : 100

·        వెంటిలేటర్లు: 500

·        ఆక్సిజెన్ సిలిండర్లు: 300

·        రెమిడిసివిర్: 40,000

·        మాస్కులు, తదితర రక్షణ సామగ్రి

ఈ సహాయ సామగ్రి అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరుకుంది. 

విదేశీ సాయంగా అందుకున్న కోవిడ్ సహాయ సామగ్రి గురించి, అది రోగులకు సహాయపడుతున్న తీరు గురించి  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్ రమేశ్ చంద్ ఇలా మాట్లాడుతున్నారు.  

[డిడి న్యూస్ ట్విట్టర్ లింక్ https://twitter.com/DDNewslive/status/1393859966159572993?s=08]

తక్షణమే సమర్థవంతంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించటం, పంపిణీ చేయటం అన్నవి అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది.  మంత్రిత్వశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ సహాయాన్ని అందుకోవటం, దాన్ని పంపిణీ చేయటం లాంటివి పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ విభాగం పనిచేయటం ప్రారంభమైంది. మే 2వ తేదీ నుంచి ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించి అమలు చేస్తోంది.   

*****


(Release ID: 1719259) Visitor Counter : 173