రైల్వే మంత్రిత్వ శాఖ
8,700 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు
కేరళ ప్రాంతంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు, 118 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. తో కేరళకు వెళ్ళే దారిలో ఉన్న - ఒక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న - 139 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు
ప్రతిరోజూ దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. ను దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్న - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
40 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. తో ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్న - మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి 14 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ద్వారా ఉపశమనం కల్పించిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
ఇప్పటివరకు మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2350 మెట్రిక్ టన్నులు; మధ్యప్రదేశ్ లో 430 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 1228 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 308 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 40 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 361 మెట్రిక్ టన్నులు; ఉత్తరాఖండ్ లో 200 మెట్రిక్ఎ టన్నులు; తమిళనాడు లో 111 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్
Posted On:
15 MAY 2021 6:05PM by PIB Hyderabad
అన్ని అడ్డంకులను అధిగమించి, కొత్త పరిష్కారాలను కనుగొనే దిశగా, భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఓ) ను పంపిణీ చేయడం ద్వారా, ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భారత రైల్వే, ఇప్పటివరకు, 540 కి పైగా ట్యాంకర్ల లో 8,700 మెట్రిక్ టన్నులకు పైగా, ఎల్.ఎం.ఓ.ను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
139 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన విషయాన్ని గమనించవచ్చు.
ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయానికి, 35 ట్యాంకర్ల లో 475 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్.ఎం.ఓ. తో నింపిన, ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు గత కొన్ని రోజులుగా ప్రతీ రోజూ దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ.ను దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్నాయి.
సాధ్యమైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా ఎల్.ఎం.ఓ.ను వివిధ రాష్ట్రాల కు రవాణా చేయడానికి భారత రైల్వే కృషి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కు 40 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. తో మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది.
కేరళ ప్రాంతంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు, 118 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. తో ఒక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కేరళకు వెళ్ళే దారిలో ఉంది.
ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయానికి, ఇప్పటివరకు మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2350 మెట్రిక్ టన్నులు; మధ్యప్రదేశ్ లో 430 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 1228 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 308 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 40 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 361 మెట్రిక్ టన్నులు; ఉత్తరాఖండ్ లో 200 మెట్రిక్ఎ టన్నులు; తమిళనాడు లో 111 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్రదేశ్ లో 40 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ లో 3084 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ దింపుకోవడం జరిగింది.
కొత్తగా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నడపడం, ఎప్పటికప్పుడు గణాంకాలతో తాజా సమాచారాన్ని సమకూర్చడం, ఒక క్రియాశీలమైన ప్రక్రియగా జరుగుతోంది. మరింతగా లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు రాత్రి తరువాత ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.
రైల్వేలు ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వేర్వేరు మార్గాలను గుర్తించి, ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల అవసరాలకు సిద్ధంగా ఉన్నాయి. ఎల్.ఎం.ఓ. ను సరఫరా చేయడానికి, రాష్ట్రాలు, భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తున్నాయి.
*****
(Release ID: 1718961)
Visitor Counter : 175