ప్రధాన మంత్రి కార్యాలయం

ఆచార్య ఎస్.టికెన్ సింగ్ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 13 MAY 2021 10:42PM by PIB Hyderabad

   ప్రొఫెసర్ ఎస్.టికెన్ సింగ్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘భారతీయ జనతా పార్టీ మణిపూర్ శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.టికెన్ సింగ్ తుదిశ్వాస విడిచారని విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. మణిపూర్ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కఠోరంగా శ్రమించిన కార్యకర్తగా ఆయని చిరకాలం గుర్తుంటారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయనెంతో చురుగ్గా వ్యవహరించేవారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అనుయాయులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను... ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

*****

DS /AKJ 


(Release ID: 1718533)