ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో మొత్తం 2 కోట్లకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు


గత 24 గంటల్లో కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

చికిత్సలో ఉన్నవారి సంఖ్య గత 24 గంటల్లో 5,632 తగ్గుదల

18 కోట్లకు దగ్గరవుతున్న టీకాలు వేసుకున్నవారి సంఖ్య ఇప్పటిదాకా 18-44 వయోవర్గంలో 39 లక్షలమందికి టీకాలు
అంతర్జాతీయ సాయాన్ని వేగంగా రాష్ట్రాలకు పంపుతున్న కేంద్రం

Posted On: 14 MAY 2021 11:01AM by PIB Hyderabad

ఇప్పటిదాకా భారత దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య కీలకమైన మైలురాయి చేరుతూ ఈరోజు 2 కోట్లు దాటింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 83.50% అయింది. గత 24 గంటలలో 3,44,776 మంది కోలుకున్నారు. ఇది కొత్తగా నమోదైన కోవిడ్ కేసులకంటే ఎక్కువ కావటం గమనార్హం.  కొత్తగా కోలుకున్నవారిలో  71.16% వాటా పది రాష్ట్రాలదే కావటం కూడా గమనార్హం.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001EABF.jpg

గడిచిన 14 రోజులలో కోలుకున్నవారి సంఖ్యను ఈ దిగువ చిత్రపటం చూపుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021H35.jpg

దేశంలో మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య ఈ రోజు  37,04,893 కు తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.41% వాటా. గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య నికరంగా 5,632 తగ్గింది. చికిత్సలో ఉన్న కేసులలో 12 రాష్ట్రాల వాటా 79.7% 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003K6RQ.jpg

భారత ప్రభుత్వం అందుకున్న అంతర్జాతీయ సాయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కేటాయించి వేగంగా పంపుతోంది.  ఇప్పటిదాకా మొత్తం  9,294 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 11,835 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 6,439 వెంటిలేటర్లు, దాదాపు  4.22 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను రోడ్డు,  వాయు మార్గాల ద్వారా రాష్టాలకు తరలించారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా మూడో దశ టీకాల కార్యక్రమం మొదలవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య వేగంగా పెరుగుతూ 18 కోట్లకు దగ్గరవుతూ ఉంది. 26,02,435  శిబిరాల ద్వారా మొత్తం 17,92,98,584 టీకా డోసులు ఇచ్చినట్టు ఉదయం 7 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందులో ఆరోగ్య సిబ్బంది  తీసుకున్న  96,18,127 మొదటి డోసులు,   66,04,549 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న    1,43,22,390 మొదటి డోసులు, 81,16,153 రెండో డోసులు, 18-45 వయోవర్గం వారు అందుకున్న మొదటి డోసులు 39,26,334 ఉండగా, 45-60 వయీవర్గం వారు తీసుకున్న  5,66,09,783 మొదటి డోసులు,  85,39,763 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,42,42,792 మొదటి డోసులు, 1,73,18,693 రెం డో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,18,127

రెండో డోస్

66,04,549

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,43,22,390

రెండో డోస్

81,16,153

18-44 వయోవర్గం

మొదటి డోస్

39,26,334

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,66,09,783

రెండో డోస్

85,39,763

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,42,42,792

రెండో డోస్

1,73,18,693

 

మొత్తం

17,92,98,584

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో పది రాష్ట్రాలవాటా 66.75% ఉంది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KH0N.jpg

గత 24 గంటలలో 18-44 వయీవర్గానికి చెందిన లబ్ధిదారులు 4,40,706  డోసులు తీసుకోగా వీరికి టీకాలు మొదలైన మే 1 నుంచి ఈ వయోవర్గం 32 రాష్ట్రాలలో కలిపి తీసుకున్న మొత్తం డోసుల సంఖ్య 39,26,334 కు చేరింది.  వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 వయోవర్గం వారు తీసుకున్న టీకా వివరాల పట్టిక ఇది: 

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్- నికోబార్ దీవులు

1,175

2

ఆంధ్రప్రదేశ్

2,153

3

అస్సాం

1,48,136

4

బీహార్

4,04,150

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,028

7

దాద్రా-నాగర్ హవేలి

729

8

డామన్-డయ్యూ

861

9

ఢిల్లీ

5,23,094

10

గోవా

1,757

11

గుజరాత్

4,19,839

12

హర్యానా

3,84,240

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూకశ్మీర్

30,169

15

జార్ఖండ్

94

16

కర్నాటక

1,04,242

17

కేరళ

1,149

18

లద్దాఖ్

86

19

మధ్యప్రదేశ్

1,36,346

20

మహారాష్ట్ర

6,34,570

21

మేఘాలయ

6

22

నాగాలాండ్

4

23

ఒడిశా

1,08,296

24

పుదుచ్చేరి

2

25

పంజాబ్

5,755

26

రాజస్థాన్

5,90,276

27

తమిళనాడు

26,467

28

తెలంగాణ

500

29

త్రిపుర

2

30

ఉత్తరప్రదేశ్

3,15,928

31

ఉత్తరాఖండ్

67,427

32

పశ్చిమ బెంగాల్

17,837

మొత్తం

39,26,334

 

గత 24 గంటలలో 20 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 118 వ రోజైన మే 13న 20,27,162 టీకాలివ్వగా  18,624 శిబిరాలలో 10,34,304 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 9,92,858 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీమే 13, 2021 (118వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

17,022

రెండో డోస్

33,409

కోవిడ్ యోధులు

మొదటి డోస్

83,628

రెండో డోస్

83,594

18-44 వయోవర్గం

మొదటి డోస్

4,40,706

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

3,53,966

రెండో డోస్

3,68,924

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,38,982

రెండో డోస్

5,06,931

మొత్తం

మొదటి డోస్

10,34,304

2ndDose

9,92,858

 

దేశంలో పెరుగుతున్న కోవిడ్ పరీక్షలను ఈ దిగువ చిత్ర పటం చూపుతుంది. ఇప్పటివరకు 31 కోట్ల కొవిడ్ నిర్థారణ  పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ కూడా స్వల్పంగా పెరిగి 7.72% అయింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005F1Q3.jpg

రోజువారీ పాజిటివిటీ స్వల్పంగా తగ్గి 20.08% కు చేరటాన్ని ఈ చిత్రపటంలో చూడవచ్చు. .

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006A39N.jpg

గడిచిన 24 గంటలలో 3,43,144 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా 72.37% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 42,582 కొత్త కేసులు రాగా, కేరళలో 39,955, కర్నాటకలో  35,297 వచ్చాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0076VAJ.jpg

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.09% గా నమోదైంది. గత 24 గంటలలో 4,000 మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో పది రాష్టాలకు చెందినవారే 72.70% ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 850 మరణాలు నమోదు కాగా కర్నాటకలో 344 మంది కరోనాతో చనిపోయారు .

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0084DLF.jpg

****


(Release ID: 1718531) Visitor Counter : 195