ప్రధాన మంత్రి కార్యాలయం

అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 14 MAY 2021 8:31AM by PIB Hyderabad

   అక్షయ తృతీయ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- ‘‘దేశ ప్రజలందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభకార్య ఫలసిద్ధితో ముడిపడిన ఈ పవిత్ర పర్వదినం- కరోనా మహమ్మారిపై మన విజయ సంకల్పం సిద్ధించడానికి మరింత శక్తినిస్తుంది’’ అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

***

DS/SH(Release ID: 1718526) Visitor Counter : 145