ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రెండు/మూడో దశలో 2-18 ఏళ్లున్న వారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి


స్వచ్ఛందంగా ముందుకువచ్చిన 525 ఆరోగ్యవంతులకు ప్రయోగాత్మక టీకా ఇవ్వనున్న భారత్‌ బయోటెక్‌

Posted On: 13 MAY 2021 10:35AM by PIB Hyderabad

రెండు/మూడో దశలో, 2-18 ఏళ్లున్న వారిపై కొవాగ్జిన్‌ (కొవిడ్‌ టీకా) క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు, ఆ టీకా ఉత్పత్తి సంస్థ భారత్‌ బయోటెక్‌ లిమిటెడ్‌కు "డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా" (‍డీసీజీఐ‌) అనుమతినిచ్చింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం "విషయ నిపుణుల కమిటీ" (ఎస్‌ఈసీ) చేసిన సిఫారసును సమగ్రంగా పరిశీలించి, బుధవారం ఆమోదించింది.  

    రెండు/మూడో దశలో ఈ క్లినికల్‌ ట్రయల్‌ చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) ప్రతిపాదన సమర్పించింది. స్వచ్ఛందంగా ముందుకువచ్చిన 525 ఆరోగ్యవంతులకు ఆ సంస్థ ప్రయోగాత్మకంగా టీకా ఇవ్వనుంది. 

    ప్రయోగంలో భాగంగా, తొలి రోజున, 28వ రోజున టీకాను కండరాల ద్వారా శరీరానికి ఇస్తారు.

    భారత్‌ బయోటెక్‌ ప్రతిపాదనపై వేగంగా స్పందించి, 11.05.2021న ఎస్‌ఈసీలో చర్చించారు. సమగ్ర చర్చ తర్వాత, క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. కమిటీ సూచించిన షరతులకు లోబడి ఈ ప్రయోగాలు జరుగుతాయి.

***



(Release ID: 1718216) Visitor Counter : 193