రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి రెండో ద‌శ వ్యాప్తికి వ్య‌తిరేకంగా జ‌ర‌గుతున్న పోరులో ముందంజ‌లో ఎంఎన్ఎస్ అధికారులు

Posted On: 12 MAY 2021 2:45PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి రెండో ద‌శ వ్యాప్తికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా జ‌ర‌గుతున్న పోరులో మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌కు (ఎంఎన్ఎస్‌) చెందిన నర్సింగ్ అధికారులు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కూడిన‌ స‌మూహంలో ముందంజ‌లో ఉన్నారు. కోవిడ్-19 వైర‌స్ సోకిన రోగులకు వైద్య సదుపాయం కల్పించేందుకు గాను వివిధ సాయుధ దళాల ఆసుపత్రుల్లో ఈ అధికారులను మోహరిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, వారణాసి, పాట్నాల్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కొత్తగా ఏర్పాటు చేసిన‌ కోవిడ్ -19 ఆస్పత్రుల కోసం రెండు వందల తొంభై నాలుగు మంది ఎంఎన్‌ఎస్ అధికారులను పంపించారు. కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ఎంఎన్ఎస్‌కు చెందిన నర్సింగ్ అధికారులు దేశానికి విధేయత మరియు ధైర్యంతో సేవ చేస్తున్నారు. ఆపరేషన్ నమస్తే, ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా స్వదేశానికి తిరిగి పంపేందుకు చేసే మిషన్లలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఎంఎన్ఎస్ అధికారులు దేశ యుద్ధ ప్రయత్నాలు, మానవతా సహాయం, సహాయక చర్యలు, అంబులెన్స్ రైళ్లు, ఆసుపత్రి నౌకలు, జలాంతర్గాములలో వీరు అంతర్భాగంగా ఉంటూ దేశ ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌లో పాలుపంచుకుంటున్నారు. వారు భారతదేశంలో దళాల సంరక్షణకు గాను.. లేహ్‌, రాజౌరి, దోడా, కార్గిల్ మరియు అనేక దూర ప్రాంతాలలో పనిచేస్తున్నారు. కాంగో, సుడాన్, లెబనాన్, తజికిస్థాన్‌కు స్నేహపూర్వక విదేశీ మిషన్ మొదలైన దేశాలకు ఐరాస శాంతి పరిరక్షక దళంలో కూడా వీరిని మోహరిస్తున్నారు. జమ్మూ&కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలు వంటి సమస్యాత్మక ప్రాంతాలలో పోరాట దళాలకు సమగ్ర సంరక్షణ ద్వారా ఈ ఎంఎన్ఎస్ త‌మ‌ సంసిద్ధత, ఓర్పును పెంచుతుంది. ఎత్త‌యిన‌ యుద్ధ క్షేత్రం నుండి మొద‌లుకొని భారతదేశంలోని విస్తారమైన ఏడారి భూములలో దేశ ర‌క్ష‌ణ చేస్తున్న భారత దళాలకు ఎంఎన్ఎస్ అధికారులు సేవ‌లందిస్తున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2021, ఇతివృత్తం ‘నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్, ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్‌కేర్’ అనే అంశాన్ని సమర్థించడం ద్వారా ఎంఎన్‌ఎస్ నర్సింగ్ అధికారులు తమ సేవలను అవసరమైన వారికి విస్తరిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
                             

****


(Release ID: 1718075) Visitor Counter : 227