ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“బి.1.617 వేరియంట్ తో భారత్ కు సంబంధమున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పలేదు”

Posted On: 12 MAY 2021 12:57PM by PIB Hyderabad

అంతర్జాతీయంగా ప్రమాదకరమైన వేరియెంట్ గా భావిస్తున్న బి.1.617 గురించి  ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించినట్టు వార్తలు రాగా, కొన్ని వార్తా సంస్థలు ఆ ప్రమాదకర వేరియంట్ ను భారత్ తో ముడిపెట్టాయి. ఈ వార్తలు అసత్యాలు, నిరాధారమైనవి.

అందువలన బి.1.617 అనే వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు విడుదల చేసిన 32 పేజీల డాక్యుమెంట్ లో భారత్ కు ఆపాదించలేదని స్పష్టం చేస్తున్నాం. ఈ నిజానికి ఆ డాక్యుమెంట్ లో ఎక్కడా ఇండియన్ (”భారతీయ”) అనే పదమే వాడలేదు.  

 

****



(Release ID: 1717905) Visitor Counter : 314