ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ సహాయంపై తాజా సమాచారం


ప్రపంచసహాయాన్ని అత్యంత వేగంగా రాష్ట్రాలకు అందిస్తున్న కేంద్రం
ఇప్పటిదాకా 8900 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 5043 ఆక్సిజెన్ సిలిండర్లు; 18 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 5698 వెంటిలేటర్లు; దాదాపు 3.4 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్ల పంపిణీ

Posted On: 10 MAY 2021 4:36PM by PIB Hyderabad

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నివారణ దిశలో భారత్ చేస్తున్న కృషికి తోడుగా ప్రపంచం నలుమూలలనుంచి వివిధ దేశాలు, సంస్థలు పంపుతున్న విరాళాలు, సహాయ సామగ్రిని భారత ప్రభుత్వం అందుకుంటోంది. సంపూర్ణ పాలన లక్ష్యంగా అందరికీ ఈ సహాయం ఒక క్రమ పద్ధతిలో అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.  భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు ఈ సహాయాన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపటంలో సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ఇప్పటిదాకా 8900 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 5043 ఆక్సిజెన్ సిలిండర్లు; 18 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 5698 వెంటిలేటర్లు; దాదాపు  3.4 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.

యుకె, దక్షిణ కొరియా, యుఎస్ ఐ ఎస్ పి ఎఫ్ నుంచి 9న అందిన ప్రధాన సామగ్రి:

·        వెంటిలేటర్లు (1000)

·        ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు (2267)

·        ఆక్సిమీటర్లు (10000)

·        సిలిండర్లు (200)

తక్షణమే సమర్థవంతంగా రాష్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించటం, పంపిణీ చేయటం అన్నవి అవిచ్ఛిన్నంగా సాగే ప్రక్రియ.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది.  మంత్రిత్వశాఖ ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేసింది. విదేశీ సహాయాన్ని అందుకోవటం, దాన్ని పంపిణీ చేయటం లాంటివి పర్యవేక్షిస్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ విభాగం పనిచేయటం ప్రారంభమైంది. మే 2వ తేదీ నుంచి ప్రామాణిక ఆచరణావిధానాలు రూపొందించి అమలు చేస్తోంది.

ఫొటో 1. డెన్మార్క్ నుంచి వచ్చిన 40 వెంటిలేటర్లను ముంబయ్ నౌకాశ్రయంలో అందుకొని మహారాష్ట్రలో పంపిణీకోసం మే 9న  అందజేశారు 

 

ఫొటో 2:  డెన్మార్క్ నుంచి వచ్చిన 13 వెంటిలేటర్లు, ముంబై సేల్స్ ఫోర్స్ నుంచి అందుకున్న  300 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లను మహారాష్టలో పంపిణీకోసం 9వ తేదీన అందజేశారు.  

ఫొటో 3:  ఇజ్రాయిల్ నుంచి వచ్చిన ఆక్సిజెన్ ఉత్పత్తి ప్లాంట్ ను వైమానిక కేంద్రం నుంచి కర్నాటకకు పంపటానికి సిద్ధం చేస్తున్న దృశ్యం   

 

ఫొటోలు 4, 5: 44 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, 102 బాక్సుల అడాప్టర్ ప్లగ్గులు, నేసల్ కాన్యులా ను మే 10న పోర్ట్ బ్లెయిర్ లో దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల డిప్యూటీ కమిషనర్ కు అందజేస్తున్న దృశ్యం

 

*****


(Release ID: 1717520) Visitor Counter : 204