యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కోవిడ్ క్లిష్టకాలంలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు మరియు కోచ్ లకు అండగా ఐఓఏ, మ్యాన్, సాయ్
Posted On:
09 MAY 2021 11:15AM by PIB Hyderabad
కోవిడ్-19 సమయంలో దేశానికి అంతర్జాతీయ పోటీలలో ప్రాతినిధ్యం వహించిన మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్ లకు అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించి వారిని ఆర్ధికంగా ఆదుకొని ఇతర సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ( మ్యాన్), ఇండియన్ ఒలింపిక్ సంఘం ( ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (సాయ్) సంయుక్తంగా ఒక ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పాయి.
తమకు అవసరమైన వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్, ఆసుపత్రిలో చేరడం లాంటి అంశాలతోపాటు ఇతర సౌకర్యాల కోసం (https://www.research.net/r/SAI-IOA-Covid-19) లో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు మరియు కోచ్ లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ సౌకర్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రాలవారీగా అందే దరఖాస్తులను పరిశీలించి తగిన సహకారం, సహాయాన్ని అందించడానికి రాష్ట్రాల ప్రతినిధులు, ఐఓఏ, సాయ్ ప్రతినిధులతో జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటయింది.
దీనిపై మాట్లాడిన "భారతదేశంలో క్రీడలకు తమ జీవితమంతా సహకరించి దేశానికి పురస్కారాలను తీసుకువచ్చిన వారికి మేము అండగా నిలుస్తాము. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మాజీ అథ్లెట్లు లేదా కోచ్‌లు కోవిడ్ 19 మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం మరియు ఐఓఏ కలసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం సంతోషంగా ఉంది. అవసరమైన వారికి సహాయం చేయగలమన్న మాకు నమ్మకం ఉంది. " అని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు అన్నారు.
భారతదేశంలోఒక పెద్ద వ్యవస్థగా వున్న క్రీడా కుటుంబాన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవలసిన అవసరం ఉందని ఐఓఏ అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ ధ్రువ్ బాత్రా అన్నారు. క్రీడాకారులను అడ్డుకొని వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చిన క్రీడలశాఖ మంత్రికి, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల అనేకమంది మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు మరియు కోచ్ లకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే అమలు చేస్తున్న వైద్య ఇతర సౌకర్యాలతో పాటు అదనంగా సౌకర్యాలను కల్పించడానికి క్రీడాకారుల కోసం ఏర్పాటైన పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి (పిడియుఎన్‌డబ్ల్యుఎఫ్ఎస్) నుంచి అదనపు నిధులను అవసరమైన క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు.
***
(Release ID: 1717310)
Visitor Counter : 196