రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అత్యవసర వినియోగానికి డిఆర్ డిఓ అభివృద్ధి చేసిన ముందుకు అనుమతులు ఇచ్చిన డీజీసీఏ

Posted On: 08 MAY 2021 1:42PM by PIB Hyderabad

కోవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు త్వరితగతిన కోలుకోవడానికి దోహద పడే విధంగా  హైదరాబాద్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో రక్షణ పరిశోధనా సంస్థకి అనుబంధంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన మందుకు అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. కోవిడ్-19ని సమర్ధంగా ఎదుర్కోవడానికి సంస్థ  2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డిజి)ని అభివృద్ధి చేసింది. దీనికి క్లినికల్ ట్రయల్ నిర్వహించారు.  ఆసుపత్రిలో చేరిన రోగులు  వేగంగా కోలుకోవడానికి, ఆక్సిజన్ పై ఎక్కువగా ఉపయోగపడకుండా  2-డిజి సహాయపడుతుందని పరీక్షల్లో వెల్లడయింది.  2-డిజితో చికిత్స పొందిన కోవిడ్ రోగుల్లో ఎక్కువమందికి ఆర్టీ పీసీఆర్ నెగటివ్ ఫలితాలు కనిపించాయి. ఇది కోవిడ్ రోగులకు ప్రయోజనం కలిగిస్తుంది. 

కోవిడ్ ను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన  డిఆర్ డిఓ కోవిడ్ ను సమర్ధంగా ఎదుర్కొనే 2-డిజి అభివృద్ధిపై దృష్టి సారించింది. కోవిడ్ మొదటి దశలో ఉన్నప్పుడు  హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో 2-డిజిని  డిఆర్ డిఓ,  ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో పరీక్షించారు. సార్స్-కోవ్-2 వైరస్ ని నిరోధించే అంశంలోనూ, వైరస్ వ్యాప్తిని అరికట్టే అంశంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడయింది. దీనిని ఆధారంగా చేసుకొని 2-డిజి యొక్క దశ -2 క్లినికల్ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్  ఆర్గనైజేషన్ లు మే 2020 లో అనుమతించాయి. 

మందుల సమర్ధత, భద్రతపై కోవిడ్ రోగులపై రెడ్డీస్ లాబొరేటరీస్ తో కలసి  రక్షణ పరిశోధనా  సంస్థ 2020 మే నుంచి అక్టోబర్ వరకు  క్లినికల్ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలను తొలి  దశలో ఆరు ఆసుపత్రులు, రెండవ దశ పరీక్షలను 11 ఆసుపత్రుల్లో 110 మంది రోగులపై పరీక్షించారు. మందు సమర్ధంగా పనిచేస్తూ రోగులు త్వరితగతిన కోలుకోవడానికి ఉపయోగపడిందని పరీక్షల్లో వెల్లడయింది. 

2-డిజిని వినియోగించినవారు సాధారణ చికిత్స పొందినవారికంటే త్వరగా కోలుకున్నారని తేలింది. సాధారణ మందులను ఉపయోగిస్తున్న వారితో పోల్చి చూస్తే 

2-డిజిని ఉపయోగించినవారు రెండున్నర రోజులు వేగంగా సాధారణ స్థాయికి చేరారని పరీక్షలు నిర్ధారించాయి. 

తొలి రెండు దశల పరీక్షలు విజయవంతం కావడంతో మూడవ దశ పరీక్షలకు డిసిజిఐ నవంబర్ 2020లో అనుమతి ఇచ్చింది. మూడవ దశ ప్రయోగాలను 2020 డిసెంబర్ - 2021 మార్చ్ ల మధ్య ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ,  పశ్చిమ బెంగాల్, గుజరాత్,  రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో వున్న 27 కోవిడ్ ఆసుపత్రుల్లో నిర్వహించి వీటి ఫలితాలను డిసిజిఐకి సమర్పించారు. సాధారణ చికిత్స పొందినవారితో పోల్చి చూస్తే 2-డిజిని ఉపయోగించినవారు త్వరితగతిన కోలుకోవడమే కాకుండా వీరికి ఆక్సిజన్ ఆవశ్యకత మూడవ రోజుకి తగ్గిందని వెల్లడయింది. 65 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న రోగులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇటువంటి ఫలితాలే వచ్చాయి. దీనితో దీనిని తీవ్రమైన, ఒక మోస్తరు కోవిడ్ లక్షణాలతో వున్న రోగులకు అత్యవసరంగా ఇవ్వడానికి  డిసిజిఐ 2021 మే ఒకటవ తేదీన అనుమతులు మంజూరు చేసింది. 2-డిజిని వేగంగా పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి అవకాశం వుంది. 

పొడి రూపంలో వుండే ఈ మందు సాచెట్‌లో లభిస్తుంది. దీనిని నీళ్లలో కలిపి నోటిద్వారా తీసుకోవచ్చును. ఇది వైరల్ సోకిన కణాల్లో చేరి వైరస్ అభివృద్ధిని అరికడుతుంది. వైరల్ సోకిన కణాల్లోకి చేరి పనిచేయడం 2-డిజి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. 

కోవిడ్-19 రెండవ దశ లో ఏకువ మంది రోగులకు ఆక్సిజన్ అందించవలసి వస్తోంది. వీరిలో ఎక్కువ మంది చికిత్స కోవం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో వైరల్ సోకిన కణాల్లోకి చేరి ప్రభావం చూపే 2-డిజి విలువైన ప్రాణాలను కాపాడుతూ ఆసుపత్రుల్లో చేరే అవసరాన్ని తగ్గిస్తుంది. 

***(Release ID: 1717276) Visitor Counter : 403