ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ నిర్వహణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆధునిక ప్రత్యేక సంరక్షణ సంస్థలకు, అంతర్జాతీయ సహాయ సామాగ్రిని సమర్థవంతంగా కేటాయించి, వెంటనే పంపిణీ చేస్తున్న - భారత ప్రభుత్వం.


6608 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్; 3856 ఆక్సిజన్ సిలిండర్లు; 14 ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు; 4,330 వెంటిలేటర్లు / బి-పి.ఏ.పి; 3 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజంక్షన్లను ఇంతవరకు పంపిణీ / రవాణా చేయడం జరిగింది.

Posted On: 08 MAY 2021 4:11PM by PIB Hyderabad

కోవిడ్-19 కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ సామూహిక పోరాటంలో భాగంగా, భారతదేశం పట్ల సంఘీభావం, సద్భావనను ప్రతిబింబిస్తూ, భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేయూత నిస్తోంది. భారతదేశం అందుకున్న సహాయ సామాగ్రిని సమర్ధవంతంగా కేటాయించి, వెంటనే పంపిణీ చేయడం కోసం, భారత ప్రభుత్వం, ఒక క్రమబద్ధమైన, సంప్రదాయబద్దమైన యంత్రాంగాన్ని రూపొందించింది. ఈ ఆధునిక ప్రత్యేక సంరక్షణ సంస్థలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని, వైద్య మౌలిక సదుపాయాలను భర్తీ చేయడంతో పాటుఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల సమర్థవంతమైన వైద్య నిర్వహణ కోసం వారి చికిత్స యాజమాన్య సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఇది సహాయ పడుతుంది

2021 ఏప్రిల్, 27 తేదీ నుండి భారత ప్రభుత్వం, వివిధ దేశాలు / సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 ఉపశమన వైద్య సామాగ్రి మరియు పరికరాలను, స్వీకరిస్తోంది.

2021 ఏప్రిల్,  27 తేదీ నుండి 2021 మే, 7 తేదీ వరకు, మొత్తం మీద, 6,608 ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్స్;  3,856 ఆక్సిజన్ సిలెండర్లు;  14 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 4,330 వెంటిలేటర్లు / బి-పి.ఐ.పి. లతో పాటు 3 లక్షల రెంమ్డేసివిర్ ఇంజెక్షన్లను పంపిణీ/రవాణా చేయడం జరిగింది

యు.ఎస్.ఐ.ఎస్.పి.ఎఫ్; స్విట్జర్లాండ్; పోలాండ్; నెదర్లాండ్ మరియు ఇజ్రాయెల్ నుండి 2021 మే, 7 తేదీన అందుకున్న ప్రధాన వస్తువులు:

*      ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్లు (2060);

*      రెంమ్డేసివిర్ (30,000)

*      వెంటిలేటర్లు (467); 

*      ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు (03).

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సంస్థలకు సమర్థవంతమైన తక్షణ కేటాయించి, ఒక క్రమ పద్ధతిలో పంపిణీ చేయడం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది.   ఈ ప్రక్రియను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిరంతరం, సమగ్రంగా పర్యవేక్షిస్తోంది.

 

ఫోటో-1: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యు.ఎస్‌.ఐ.ఎస్‌.పి.ఎఫ్) నుంచిస్వీకరించిన 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ రోజు ఢిల్లీ నుండి అస్సాం కు పంపుతున్న చిత్రం. 

 

ఫోటో -2:  జర్మనీ కి చెందిన మొబైల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ అండ్ ఫిల్లింగ్ సిస్టమ్ ను ఈ తెల్లవారుజామున డి.ఆర్.డి.ఓ. కు రవాణా చేస్తున్న చిత్రం. ఇది వైద్య ఉపయోగం కోసం 360. లీటర్ల 93 శాతం ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 420.0 లీటర్ల ఆక్సిజన్  రిజర్వ్ చేసుకునే ట్యాంకు కూడా ఉంది. డి.ఆర్.డి.ఓ. లోని ఆరోగ్య సదుపాయాలలో ఉపయోగం కోసం దీనిని రవాణా చేశారు. 

ఫోటో-3 :  నెదర్లాండ్ నుండి వచ్చిన  112 వెంటిలేటర్లు. ఢిల్లీ నుండి తెలంగాణకు వెళ్ళే మార్గంలో ఉన్న చిత్రం. 

గ్రాంట్లు, సహాయం, విరాళాల రూపంలో వస్తున్న, విదేశీ కోవిడ్ సహాయ సామాగ్రిని స్వీకరించి, కేటాయించడానికి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఒక  ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం 2021 ఏప్రిల్, 26 తేదీ నుండి పనిచేయడం ప్రారంభించింది.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించి, 2021 మే, 2వ తేదీ నుండి అమలు చేస్తోంది. 

*****



(Release ID: 1717090) Visitor Counter : 182