రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఈ నెల 16 వరకు దేశవ్యాప్తంగా తగిన లభ్యత ఉండేలా రెమ్‌డెసివిర్ వయల్స్ కేటాయింపు: శ్రీ డి.వి.సదానంద గౌడ
Posted On:
07 MAY 2021 1:48PM by PIB Hyderabad
అన్ని రాష్ట్రాల రెమ్‌డెసివిర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 16 వరకు కొరత రాకుండా, దేశవ్యాప్తంగా చేసిన ఔషధాల కేటాయింపులను కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ ప్రకటించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఆటంకాలు లేకుండా డెమ్‌డెసివిర్ పంపిణీ జరుగుతుందని, రోగులెవరూ ఇబ్బంది పడరని చెప్పారు.
కేంద్ర ఔషధ విభాగం, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కలిసి అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాశాయి. ఈ నెల 1న డీవో ద్వారా వెల్లడించినట్లు, ఏప్రిల్ 21- మే 9వ తేదీ వరకు రూపొందించిన రెమ్‌డెసివిర్ కేటాయింపు ప్రణాళికకు కొనసాగింపుగా, ఏప్రిల్ 21 - మే 16వ తేదీ వరకు మార్చిన వ్యవధి కోసం కేంద్ర ఔషధ విభాగం, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కలిసి తాజా ప్రణాళిక రూపొందించినట్లు ఆ లేఖలో సంయుక్తంగా పేర్కొన్నాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రెమ్‌డెసివిర్‌ల కేటాయింపు జరిగింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య సరైన విధంగా వాటి కేటాయింపు జరిగేలా; ఆయా సంస్థలు వాటిని సక్రమంగా, న్యాయబద్ధంగా ఉపయోగించేలా పర్యవేక్షించాలని ఆయా ప్రభుత్వాలను కేంద్రం కోరింది.
మార్కెటింగ్ సంస్థల ద్వారా వెంటనే కొనుగోలు ఆర్డర్లు పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఆయా ప్రభుత్వాలు ఇప్పటికీ ఆర్డర్లు పెట్టకపోతే; పంపిణీ గొలుసు ప్రకారం వాటికి కేటాయించిన పరిమాణంలో, మార్కెటింగ్ సంస్థల అనుసంధాన అధికారులతో సమన్వయం చేసుకుంటూ కావలసిన మొత్తంలో ఔషధాలు కొనుగోలు చేయాలని కూడా ఆయా రాష్ట్రాలకు చెప్పింది. ఇందుకోసం రాష్ట్రాల్లోని ప్రైవేటు పంపిణీ వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకోవచ్చు.
ఏప్రిల్ 21-మే 16 మధ్య కాలానికి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 1న చేసిన కేటాయింపులు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
![](https://ci4.googleusercontent.com/proxy/_27cSkuYENF8DJCeyPWz68d7QCsuF03SrQFRKPNn_e-GMclirtuo0Fti5HYljh8qtgcG5eEWo4GMq7GTlrYnDOgLryJeEh3n4bnh09srhuOI-J1SOUfTnljMKw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SMOW.jpg)
***
(Release ID: 1716787)
Visitor Counter : 222