అంతరిక్ష విభాగం
దేశంలో కోవిడ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి అంతరిక్ష శాఖ ముందుకు వచ్చిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి
తమిళనాడు, కేరళలకు ద్రవరూపంలోని ఆక్సిజన్ నిరంతర సరఫరా
Posted On:
06 MAY 2021 6:02PM by PIB Hyderabad
కోవిడ్ సంబంధిత మద్దతులో భాగంగా, ముఖ్యంగా ద్రవ రూపంలోని ఆక్సిజన్‌ను తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్‌లకు అంతరిక్షశాఖ తన పరిధిని మించి తోడ్పాటును అందించిందని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డిఒఎన్ఇఆర్) సహాయమంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారంనాడు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, తమిళనాడు, కేరళలకు రోజుకు 9.5 టన్నుల ఆక్సిజన్‌ను అందిస్తున్నామని, దీనితోపాటుగా ఆంధ్రప్రదేశ్, చండీగఢ్‌ల ఆక్సిజన్ సామర్ధ్యాన్ని పెంచామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు.ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తయారు చేసి సరఫరా చేస్తున్న 87 టన్నుల ఎల్ఒఎక్స్‌ను ఇప్పటికే తమిళనాడు, కేరళలకు అందించామన్నారు. ఇందుకు 24x7 పని షెడ్యూల్ సాగేలా చూశామన్నారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేందుకు, అక్కడి సామర్ధ్యాన్ని పెంచుతూ 12 మెట్రిక్ టన్నుల ద్రవరూపంలోని ఆక్సిజన్‌ను పంపినట్టు వెల్లడించారు. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా జరిగేలా శాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పరిశ్రమలతో కలిసి వెంటిలేటర్లు, ప్రాణ, విఎయు సహా అత్యాధునికంగా వైద్య పరికరాలు రూపొందించి, చేపట్టనున్నట్టు తెలిపారు.
అహ్మదాబాద్‌లో, సమీపంలోని ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు, నిల్వ చేసేందుకు అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ దాదాపు 1.65 లక్షల లీటర్ల రెండు ద్రవ రూపంలోని నైట్రొజెన్ ట్యాంకులను ద్రవరూపంలోని ఆక్సిజన్ ట్యాంకులుగా మార్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. అంతేకాకుండా, అహ్మదాబాదులోని ఆసుపత్రులకు ముఖ కవచాలు (ఫేస్ షీల్డ్స్), పిపిఒ కిట్లను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
అవసరంలో ఉన్న రోగులు ఉపయోగించేందుకు డిస్పెన్సరీలకు ఆక్సిజన్ సాంద్రీకరణ చేసే కాన్సన్ట్రేటర్లను సేకరిస్తున్నామని, బ్యాగేజ్ కోసం క్రిమి సంహారక గదుల (డిస్ఇన్ఫెక్టెంట్ చాంబర్ల), కొత్త ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల రూకల్పన ఇప్పటికే పురోగతిలో ఉంది.
పౌరులు సమీప వాక్సిన్ కేంద్రాన్ని చేరుకోవడానికి కోవిన్ ఆప్‌తో అనుసంధానం చేసిన కోవిడ్ వాక్సిన్ కేంద్రాలను భారతదేశం అంతటా మ్యాపంగ్ చేయడం, ఎస్ఎసి అభివృద్ధి చేసిన నాన్-కాంటాక్ట్ థర్మల్ కెమెరా మోహరింపు, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ తో కలిసి కోవిడ్-19 డాష్‌బోర్డ్ అభివృద్ధి, త్రిపుర రాష్ట్రంలో కోవిడ్ 19 కేసుల సమాచారాన్ని సేకరించేందుకు ఫైట్ కరొనా పేరుతో అస్సాం, దిబ్రూగఢ్‌లోని ఐసిఎంఆర్ భాగస్వామ్యంతో మొబైల్ ఆప్ అభివృద్ధి సహా అంతరిక్ష శాఖ పలురకాలైన సాంకేతిక మద్దతును అందిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో మానవరహిత గగనయాన్ మిషన్ సహా షెడ్యూల్ చేసిన 10 ఉపగ్రహ ప్రయోగ ప్రాజెక్టుల కు సంబంధించిన పని జరుగుతోందని అంతరిక్ష శాఖ సీనియర్ అధికారులు డాక్టర్ జితేంద్ర సింగ్‌కు తెలిపారు. కోవిడ్ మహమ్మారి పనిని కుంటుపరుస్తున్నా, పిఎస్ెల్‌వి-సి49, సి50, సి51 ప్రయోగ ప్రచార కార్యకలాపాలు గత ఆరునెలలుగా కొనసాగుతున్నందుకు మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు బెంగళూరు, షిల్లాంగ్, శ్రీహరికోటలలో ఏర్పాటు చేసినవి కాకుండా మరిన్ని కోవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే సాధ్యతను అన్వేషించవలసిందిగా డాక్టర్ జితేంద్రసింగ్ శాఖను కోరారు.
కోవిడ్ సంక్షోభాన్ని నియంత్రించేందుకు అంతరిక్ష శాఖ చేపట్టిన వివిధ చర్యలపై మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, బయో-బబుల్ బృందాలను ప్రవేశ పెట్టడం, ఇప్పటి వరకూ సిబ్బందిలో 30 శాతానికి వాక్సినేషన్ పూర్తి కావడాన్ని ఆయన ప్రశంసించారు.
***
(Release ID: 1716656)
Visitor Counter : 224