ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పిఎం కేర్స్ నిధులతో ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ ఎం ఎల్ ఆస్పత్రులలో రెండు


భారీ ఆక్సిజెన్ ప్లాంట్లు పూర్తి, నేటి నుంచి ఆక్సిజెన్ సరఫరా ప్రారంభం
అత్యంత వేగంగా 16 కోట్ల టీకా డోసులు పూర్తి చేసిన భారత్

మూడో దశకింద 18-44 వయోవర్గానికి 6.7 లక్షల టీకాలు

గత 24 గంటలలో 3.38 లక్షలకు పైగా కోలుకున్న బాధితులు

Posted On: 05 MAY 2021 12:04PM by PIB Hyderabad

పిఎం కేర్స్ నిధులతో ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ ఎం ఎల్ ఆస్పత్రులలో చేపట్టిన  రెండు భారీ ఆక్సిజెన్ ప్లాంట్ల నిర్మాణం కేవలం

వారం రోజుల్లోనే పూర్తి కావటం ఒక చెప్ప్పుకోదగిన పరిణామం.   యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వాయుమార్గం ద్వారా

కోయంబత్తూరు నుంచి తరలించి నిన్ననే ఢిల్లీలో నెలకొల్పారు.  ఈ రెండు ప్లాంట్లలోనూ ఈ సాయంత్రం నుంచే ఆక్సిజెన్

ఉత్పత్తి జరుగుతుంది.

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా 500 ఆక్సిజెన్ తయారీ యూనిట్ల

నిర్మాణం కేసం పిఎం కేర్స్ నుంచి నిధుల కేటాయింపు జరిగింది. వీటి నిర్మాణం మూడు నెలలలోపు పూర్తవుతుంది.

ఇందులో ఐదు భారీ ప్లాంట్లను ఎయిమ్స్ ట్రామా సెంటర్ లోను, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి ( ఆర్ ఎం ఎల్),

సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలోను, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, ఝజ్జర్ ఎయిమ్స్  (హర్యానా) లోను ఏర్పాటు చేయాలని

నిర్ణయించారు.

న్యూ ఢిల్లీ ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన ఆక్సిజెన్ ప్లాంట్ చిత్రపటాలు ఇవి:  

 

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో నెలకొల్పిన ఆక్సిజెన్ ప్లాంట్ చిత్రపటాలివి: 

మూడో దశ టీకాల కార్యక్రమం కూడా ప్రాంభంకాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 16 కోట్లు దాటింది.

ఈ మైలురాయిని చేరుకోవటానికి భారతదేశానికి 109 రోజులు పట్టింది. అదే అమెరికాకు 111 రోజులు, చైనాకు 116 రోజులు పట్టింది.

12 రాష్ట్రాలలో 18-44 వయోవర్గానికి 6,71,285 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఈ రాష్టాలలో చత్తీస్ గఢ్ (1,026),

ఢిల్లీ (82,000), గుజరాత్ (1,61,625), జమ్మూ-కశ్మీర్ (10,885), హర్యానా  (99,680), కర్నాటక (3,840), మహారాష్ట్ర

(1,11,621), ఒడిశా (13,768), పంజాబ్  (908), రాజస్థాన్ (1,30,071), తమిళనాడు (4,577), ఉత్తరప్రదేశ్ (51,284)

ఉన్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 23,66,349 శిబిరాల ద్వారా 16,04,94,188  టీకా

డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  94,62,505 మొదటి డోసులు,  63,22,055 రెండో డోసులు,

కోవిడ్ యోధులు తీసుకున్న  1,35,65,728 మొదటి డోసులు, 73,32,999 రెండో డోసులు, 18-44 మధ్య వయోవర్గం వారు

తీసుకున్న  6,71,285 డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  5,29,50,584 మొదటి డోసులు,  1,23,85,466 రెండో డోసులు

45-60 ఏళ్ళ మధ్యవారు తీసుకున్న  5,33,94,353 మొదటి డోసులు, 44,09,213 రెండో డోసులు ఉన్నాయి..

ఆరోగ్య సిబ్బంది

కొవిడ్ యోధులు

18-44 వయోవర్గం

45 - 60 వయో వర్గం

 60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

94,62,505

63,22,055

1,35,65,728

73,32,999

6,71,285

5,33,94,353

44,09,213

5,29,50,584

1,23,85,466

16,04,94,188

 

దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో పది రాష్టాలవాటా 66.86% ఉంది.

 

 గత 24 గంటలలో 14 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 109 వ రోజైన మే 4న 14,84,989 టీకా డోసులిచ్చారు.

 14,011శిబిరాల ద్వారా 7,80,066 మంది మొదటి డోస్ తీసుకోగా మంది 7,04,923 రెండో డోస్ తీసుకున్నారు.

 

తేదీ : మే 4, 2021 (109వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44వయోవర్గం

45 -60 వయోవర్గం

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

 

13,591

22,964

56,415

63,855

2,63,651

3,21,811

2,50,637

1,24,598

3,67,467

7,80,066

7,04,923

 

 

దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,69,51,731 కు చేరుకోగా  జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 82.03%.

గత 24 గంటలలో 3,38,439 మంది కోలుకోగా ఇందులో పది రాష్ట్రాలవాటా 73.4% ఉంది.

పదిహేడు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వారపు సగటు పాజిటివిటీ జాతీయ సగటు  (21.46%) కంటే తక్కువ ఉంది.

పంతొమ్మిది రాష్టాలు, కేంద్రపాలితప్రాంతాలలో వారపు సగటు పాజిటివిటీ జాతీయ సగటు కంటే ఎక్కువ ఉంది. 

గత 24 గంటలలో 3,82,315 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు -  మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక,

కేరళ, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో 70.91% కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో

అత్యధికంగా  51,880 కేసులు, . కర్నాటకలో  44,631, కేరళలో  37,190 కొత్త కేసులు వచ్చాయి.

భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు 34,87,229 కు చేరుకోగా, ఇవి మొత్తం పాజిటివ్ కేసులలో 16.87%.   గత 24 గంటలలో

చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య నికరంగా 40,096 పెరిగాయి. పన్నెండు రాష్ట్రాలలోనే వీటి పెరుగుదలవాటా 81.25% ఉంది.  .

జాతీయ స్థాయిలో కోవిడ్ బాధితులలో మరణాల శాతం  1.09% కి చేరింది. గత 24 గంటలో 3,780 మంది కోవిడ్ వల్ల

చనిపోయారు. అందులో పది రాష్ట్రాల వాటా 74.97%  ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక రోజులో 891 మంది,

ఉత్తరప్రదేశ్ లో 351 మంది చనిపోయారు.

 

గత 24 గంటలలో ఏడు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: మేఘాలయ,

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, అండమాన్-నికోబార్ దీవులు

 

                                                   

****


(Release ID: 1716215) Visitor Counter : 212