ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చిన టీకా డోసులు 17.02 కోట్లు


ఇంకా రాష్ట్రాల దగ్గర నిల్వ ఉన్న డోసులు 94.47 లక్షలు

వచ్చే 3 రోజుల్లో రాష్ట్రాలకు పంపనున్న డోసులు 36 లక్షలు

Posted On: 05 MAY 2021 10:49AM by PIB Hyderabad

కోవిడ్ మీద పొరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధినిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స  అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా  టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది.

మే 1వ తేదీ నుంచి మూడో దశ వేగవంతం చేయటం మొదలైంది. అర్హులైన కొత్త వయోవర్గపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 28న ప్రారంభంకాగా కోవిన్ పోర్టల్  (cowin.gov.in) లోను, ఆరోగ్య సేతు యాప్ ద్వారా నమోదవుతున్నారు.

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు  దాదాపు 17.02 కోట్ల  (17,02,42,410)  కోవిడ్ డోసులు

ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి 16,07,94,796 డోసులు ఉన్నట్టు ఈ ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్రాల దగ్గర ఇంకా 94.47 లక్షల  (94,47,614) టీకా డోసులు  అందుబాటులో ఉండగా  మరో 36 లక్షల  (36,37,030) టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రం పంపబోతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012LZ6.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2021-05-05at11.08.47KV1B.jpeg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KPE2.jpg

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003LEWO.jpg

******



(Release ID: 1716161) Visitor Counter : 218