ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ నౌకా దళం చేపడుతున్న కోవిడ్ సంబంధిత కార్యక్రమాలను సమీక్షించిన ప్రధాన మంత్రి


వివిధ నగరాల లో నౌకా దళం ఆసుపత్రుల ను పౌరుల వినియోగం కోసం తెరవడం జరుగుతోంది


లక్షద్వీప్, అండమాన్ & నికోబార్ దీవుల లో ఆక్సీజన్ లభ్యత ను పెంచుతున్న నౌకా దళం


ఆక్సీజన్ కంటేనర్ లతో పాటు ఇతర సరఫరాల ను విదేశాల నుంచి భారతదేశానికి చేర్చుతున్న నౌకా దళం


దేశం లోని వివిధ ప్రదేశాల లో కోవిడ్ సంబంధి విధుల ను నిర్వహించడానికి నావికా దళం లోని వైద్య సిబ్బంది ని నియోగించడమైంది

Posted On: 03 MAY 2021 7:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నావికా దళ ప్రధానాధికారి ఎడ్ మిరల్ శ్రీ కరమ్ బీర్ సింహ్ సోమవారం నాడు సమావేశమయ్యారు.

మహమ్మారి కాలం లో దేశ ప్రజల కు సహాయం చేయడానికి భారత నావికా దళం పక్షాన చేపడుతున్న వివిధ కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి కి ఆయన వివరించారు.  భారతీయ నావికా దళం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తో సంబంధాన్ని ఏర్పరచుకొంది,  ఆసుపత్రుల లో పడకల ను, రవాణా, టీకా మందు ను వేయించే కార్యక్రమం అమలు రూపాల లో సహాయం అందించనున్నట్లు ప్రస్తావించిందని కూడా ప్రధాన మంత్రి కి ఆయన తెలిపారు.  వివిధ నగరాల లో నావికా దళం ఆసుపత్రుల లో పౌరుల ఉపయోగం కోసం పడకల ను కేటాయించడాన్ని గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు.

కోవిడ్ సంబంధి విధుల ను నిర్వహించడానికి నావికా దళం లోని వైద్య చికిత్స సిబ్బంది ని  దేశం లోని వివిధ ఆసుపత్రుల లో నియోగించిన విషయాన్ని ప్రధాన మంత్రి కి ఆయన వెల్లడించారు.  కోవిడ్ ఆసుపత్రుల లో వైద్య సిబ్బంది ని పెంచడం కోసం నావికా దళాని కి చెందిన సిబ్బంది కి యుద్ధ క్షేత్రం లో అనుసరించే వైద్య సంరక్షణ తాలూకు శిక్షణ ను ఇవ్వడం జరుగుతోంది.

ఆక్సీజన్ లభ్యత ను పెంచడం లో భారతీయ నావికాదళం సహాయం చేస్తోందని, లక్షద్వీప్ తో పాటు అండమాన్ & నికోబార్ దీవుల లో కోవిడ్ సంబంధిత సరఫరాల ను దేశాని కి చేర్చుతోందని నౌకా సేన ప్రధానాధికారి ఎడ్ మిరల్ శ్రీ కరమ్ బీర్ సింహ్ ప్రధాన మంత్రి కి వివరించారు.

బహ్రైన్, కతార్, కువైత్, సింగపూర్ ల నుంచి ఆక్సీజన్ కంటేనర్ లతో పాటు ఇతర సరఫరాల ను కూడా భారతీయ నౌకా సేన భారతదేశాని కి చేర్చుతున్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి కి శ్రీ కరమ్ బీర్ సింహ్ తెలియజేశారు.

 

WhatsApp Image 2021-05-03 at 7.14.03 PM.jpeg

***



(Release ID: 1715830) Visitor Counter : 214