ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా-యుకె వర్చువల్ సమిట్ (మే 04, 2021)

Posted On: 02 MAY 2021 11:00PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ బోరిస్ జాన్ సన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మే నెల 4వ తేదీ న వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు.

భారతదేశం, యుకె లు 2004వ సంవత్సరం నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి.  దీనిలో భాగం గా వివిధ రంగాల లో కలసి పనిచేయడం తో పాటు క్రమం తప్పక ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాలు కూడా చోటు చేసుకొన్నాయి.  ఈ శిఖర సమ్మేళనం బహుముఖీన వ్యూహాత్మక బంధాల ను ఉన్నతీకరించుకొనేందుకే కాకుండా ఇరు పక్షాల ప్రయోజనాలు ముడిపడ్డ ప్రాంతీ అంశాల లోను, ప్రపంచ అంశాల లోను సహకారాన్ని వృద్ధిపరచుకొనేందుకు కూడా ఇరు దేశాలకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందించనుంది.  నేతలిద్దరూ  కోవిడ్ 19 సంబంధి సహకారాన్ని గురించి, అలాగే మహమ్మారి కి వ్యతిరేకం గా ప్రపంచవ్యాప్తం గా సాగుతున్న ప్రయాసల ను గురించి కూడా చర్చించనున్నారు.

శిఖర సమ్మేళనం లో ఒక సంపూర్ణమైనటువంటి ‘రోడ్ మేప్ 2030’ ని ఆవిష్కరించడం జరుగుతుంది.  ఆ రోడ్ మేప్ ప్రజా సంబంధాలు, వ్యాపారం మరియు సమృద్ధి, రక్షణ మరియు భద్రత, జలవాయు సంబంధి కార్యాచరణ మరియు ఆరోగ్య సంరక్షణ అనే అయిదు కీలకమైన రంగాల లో తదుపరి దశాబ్ద కాలం లో భారతదేశం-యుకె సహకారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి,  భారతదేశం-యుకె సహకారాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి బాట పరుస్తుంది.  



 

***



(Release ID: 1715620) Visitor Counter : 141