రైల్వే మంత్రిత్వ శాఖ

నాగాలాండ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వ కోరిక మేర‌కు 10 ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను వెంట‌నే త‌ర‌లించడం ప్రారంభించిన రైల్వే


వివిధ స్టేష‌న్ల‌లో కోవిడ్ కోచ్‌ల‌ను సిద్ధంగా ఉంచాల్సిందిగా కోరిన అస్సాం ప్ర‌భుత్వం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌ల‌లో వాడ‌కానికి అద‌న‌పు కోవిడ్ కోచ్‌ల‌ను సిద్దం చేసిన రైల్వే
జ‌బ‌ల్‌పూర్‌కు ఐసొలేష‌న్ కోచ్‌లు స‌ర‌ఫ‌రా

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు నంద్రుబార్ నుంచి పాల‌ఘార్‌కు ఐసొలేష‌న్ కోచ్‌ల త‌ర‌లింపు.
దేశంలోని వివిధ ప్రాంతాల‌లో 213 ఐసొలేష‌న్ కోచ్‌లు ప్ర‌స్తుతం ఉప‌యోగంలో ఉన్నాయి.

ఈ ఐసొలేష‌న్ కోచ్‌ల‌లో 3200 ఉచిత బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Posted On: 02 MAY 2021 2:57PM by PIB Hyderabad

కోవిడ్ పై దేశం సాగిస్తున్న ఉమ్మ‌డి పోరాట సామార్ధ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ‌శాఖ త‌న బ‌హుముఖ చొర‌వ‌లో భాగంగా 64 వేల ప‌డ‌క‌ల‌తో 4000 ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను సిద్ధం చేసింది.
రాష్ట్రాల‌తో క‌లిసి ఉమ్మ‌డిగా ప‌నిచేసేందుకు, రాష్ట్రాల‌కు వీలైనంత త్వ‌ర‌గా చేరుకునేందుకు రైల్వే శాఖ త‌న కార్యాచ‌ర‌ణ‌ను వికేంద్రీ క‌రించింది. ఇందుకు అనుగుణంగా ఆయా జోన్లు, డివిజ‌న్ల‌కు అవి కుదుర్చుకున్న అవ‌గాహ‌నా ఒప్పందాల‌కు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ చేపట్టేందుకు సాధికార‌త క‌ల్పించింది. ఈ ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను భార‌తీయ రైల్వే నెట్ వ‌ర్క్‌లో వీలైనంత త్వ‌ర‌గా త‌ర‌లించి ఆయా ప్ర‌దేశాల‌కు చేర్చడానికి అవ‌కాశం ఉంది.\ఇందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల డిమాండ్‌ను అనుస‌రించి ప్ర‌స్తుతం 213 కోవిడ్ చికిత్సా కోచ్‌ల‌ను రాష్ట్రాల‌కు అప్ప‌గించారు. వీటిలో బెడ్ల సంఖ్య 3400.ఐసొలేష‌న్ కోచ్‌లు ప్ర‌స్తుతం ఢిల్లీ, మ‌హారాష్ట్ర ( అజినిఐసిడి, నంద్రుబార్‌), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (ఇండోర్ స‌మీపంలోని తిహి)ల‌లో వాడుతున్నారు. తాజాగా నాగాలాండ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నుంచి ఐసొలేష‌న్ కోచ్‌ల కోసం అభ్య‌ర్థ‌న వ‌చ్చింది. అందుకు అనుగుణంగా రైల్వే వెంట‌నే స్పందించి 10 ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను దిమాపూర్ లో ఉంచింది.


భార‌తీయ రైల్వే ఉత్త‌ర‌ప్రదేశ్ లోని ఫైజాబాద్‌, భ‌డోహి, వార‌ణాశి, బ‌రేలి, న‌జీబాబాద్‌ల‌లో 5 కోచ్‌ల‌ను నిలిపింది. జిల్లా అధికారుల కోరిక మేర‌కు ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను నంద‌ద్రుబార్‌నుంచి పాల్‌ఘార్ కు త‌ర‌లిస్తున్నారు. జ‌బ‌ల్‌పూర్ లో కూడా ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఢిల్లీ, యుపి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌ల‌లో ఐసొలేష‌న్ కోచ్‌ల ఉప‌యోగం ప‌రిస్థితి కింద పేర్కొన్న విధంగా ఉంది.
నంద్రుబార్ (మ‌హారాష్ట్ర‌)లో గ‌త కొద్ది రోజుల‌లో 6 కొత్త కేసుల‌ను న‌మోదు చేసుకున్నారు, ముగ్గురు పేషెంట్ల‌ను ఐసొలేష‌న్ గ‌డువు ముగిసిన త‌ర్వాత ఇంటికి పంపారు. 35 మంది కోవిడ్ పేషెంట్లు ప్ర‌స్తుతం కోవిడ్ స‌దుపాయం పొందుతున్నారు. మొత్తం మీద ఇప్ప‌టివ‌ర‌కు 95 అడ్మిష‌న్లు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత 60 మందిని రాష్ట్ర ఆరోగ్య అధికారులు వారి ఆరోగ్యం కుదుట పడిన త‌ర్వాత ఇంటికి పంపారు. ఇప్ప‌టికీ 343 ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయి. రైల్వేశాఖ 11 కోవిడ్ కేర్ కోచ్‌ల‌ను  అజిని ఐలండ్ కంటైన‌ర్‌డిపో వ‌ద్ద నిలిపి ఉంచింది. (ఒక కోచ్‌ను వైద్య సిబ్బంది, స‌ర‌ఫ‌రాల కోసం కేటాయించారు). వీట‌ని నాగ‌పూర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు అప్ప‌గించింది.

ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నుంచి  2 కోచ్‌ల‌కు డిమాండ్ వ‌చ్చింది. ప‌శ్చిమ రైల్వేకి చెందిన‌ ర‌త్లాం డివిజ‌న్ ఇండోర్ స‌మీపంలోని తిహి వ‌ద్ద‌ 22 కోచ్‌ల‌ను ఏర్పాటు చేసింది. ఇవి 320 బెడ్ల సామ‌ర్ద్యం క‌లిగి ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ 12 మంది పేషెంట్ల‌ను చేర్చుకున్నారు. ఇందులో 308 బెడ్లు భోపాల్ వ‌ద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక్క‌డ 20 కోచ్‌లు నిలిపిఉంచారు. ఇందులో 21 మందిని చేర్చుకున్నారు. న‌లుగురు పేషెంట్లను కోలుకున్న అనంత‌రం ఇంటికి పంపారు. ఇక్క‌డ ఇంకా 275 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.

ఢిల్లీలో  రాష్ట్ర‌ప్ర‌భుత్వం 75 కోవిడ్ కేర్ కోచ్‌లు కావాలంటూ చేఇన‌ డిమాండ్‌ను  రైల్వే శాఖ పూర్తిగా తీర్చింది.  
ఈ కోచ్‌ల సామ‌ర్ధ్యం 1200 ల బెడ్లు. 50 కోచ్‌ల‌ను  షాకూర్ బ‌స్తి వ‌ద్ద నిలిపి ఉంచ‌గా 25 కోచ్‌ల‌ను ఆనంద్ విహార్ స్టేష‌న్ వ‌ద్ద ఉంచారు. ప్ర‌స్తుతం న‌లుగురిని అడ్మిట్ చేసుకున్నారు. ఒక పేషెంట్‌ను డిశ్చార్జి చేశారు. 1196 బెడ్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి.
 
కోవిడ్ కేర్ కోచ్‌ల వినియోగానికి సంబంధించి పైన పేర్కొన్న సమాచారం రికార్డుల‌లోని తాజా స‌మాచారం ఆధారంగా రూపొందించిన‌ది. మొత్తం 123 మందిని కోవిడ్ కేర్ కోచ్‌ల‌లో అడ్మిట్ చేసుకోగా 62 మంది ఆ తర్వాత డిశ్చార్జి చేశారు. ప్ర‌స్తుతం 61 మంది కోవిడ్ పేషెంట్లు ఐసొలేష‌న్ కోచ్‌ల‌ను వాడుకుంటున్నారు. దిమాపూర్‌లో కొత్త‌గా ఏర్పాటు చేసిన కోచ్‌ల సామ‌ర్ధ్యంతో స‌హా 3200 బెడ్లు ఈ కోవిడ్ కేర్ కోచ్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వం కోచ్‌ల కోసం అభ్య‌ర్ధించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, ఫైజాబాద్‌, భ‌డోహి, వార‌ణాశి, బ‌రేలి,నిజామాబాద్‌ల‌లో మొత్తం 800 బెడ్లు ( 50 కోచ్‌ల‌లో) అందుబాటులో ఉంచారు.
అస్సాం ప్ర‌భుత్వం 150 కోవిడ్ కోచ్‌ల‌ను వివిధ స్టేష‌న్ల‌లో సిద్దంగా ఉంచాల్సిందిగా కోరింది. వీటిని ఇంకా ఏర్పాటు చేయ‌న‌ప్ప‌టికీ, అవ‌స‌ర‌మైన‌పుడు కామాఖ్య‌, (గువాహ‌టి), లుమ్‌డింగ్‌, న్యూ బొంగైగామ్‌, సిల్చార్‌, బ‌ద‌ద‌ర్‌పూర్‌, దిబ్రూఘ‌డ్‌ల‌లో ఈ కోచ్‌ల‌ను ఏర్పాటు చేయాల్సిందిగా చేయాల్సిందిగా వారు సూచించారు

***

 



(Release ID: 1715575) Visitor Counter : 192