ప్రధాన మంత్రి కార్యాలయం

వైద్యం కోసం వాయు రూప ఆక్సీజన్ వాడకం పై సమీక్ష చేపట్టిన ప్రధాన మంత్రి

Posted On: 02 MAY 2021 3:24PM by PIB Hyderabad

ఆక్సీజన్ లభ్యత, సరఫరా ల పెంపు దిశ గా వినూత్న మార్గాల ను అన్వేషించవలసింది గా తాను ఇచ్చిన ఆదేశాలకు అనుగుణం గా, వైద్య అవసరాల కు వాయు రూప ఆక్సీజన్ వాడకం పై ఈ రోజు న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఉక్కు కర్మాగారాలు, చమురుశుద్ధి కర్మాగారాలు, పెట్రో-రసాయన పరిశ్రమలు, అత్యుష్ణ జనిత ప్రక్రియల ను వినియోగించే పరిశ్రమ లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు తదితరాలలో ఆక్సీజన్ ఉత్పత్తి యంత్రాగారాలు వాయు రూప ఆక్సీజన్ ను ఉత్పత్తి చేసి, సొంతం గా వినియోగిస్తుంటాయి.  ఇటువంటి వాయు రూప ఆక్సీజన్‌ ను వైద్యచికిత్స సంబంధి అవసరాల కోసం వినియోగించుకొనేందుకు వీలు ఉంది.

ఈ దిశ లో అనుసరించే వ్యూహం లో భాగం గా- నిర్దిష్ట స్వచ్ఛత తో వాయు రూప ఆక్సీజన్ ను ఉత్పత్తి చేసే పారిశ్రామిక సంస్థల ను గుర్తించాలని సమావేశం నిర్ణయించింది.  అలాగే వీటిలో నగరాలు/జన సమ్మర్ద ప్రాంతాలు/ డిమాండ్‌ గ‌ల‌ ప్రదేశాలకు దగ్గర గా ఉన్న వాటి జాబితా ను రూపొందించాలని తీర్మానించింది.  ఆయా ఆక్సీజన్ వనరుల కు సమీపం లో ఆక్సీజన్ ఆధారిత పడకల తో కోవిడ్ ఆరోగ్య సంరక్షణ కు సంబంధించిన తాత్కాలిక కేంద్రాల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ఈ మేరకు ప్రయోగాత్మకం గా అటువంటి 5 ఆరోగ్య సదుపాయాల ఏర్పాటు ఇప్పటికే ప్రారంభం కాగా, అవన్నీ ఆశావహం గా ముందుకు సాగుతున్నాయి.  దీనిని ఆక్సీజన్ ప్లాంటుల ను నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రైవేటు పారిశ్రామిక సంస్థల తో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం తో పూర్తి చేయడం జరుగుతోంది.

తాజా వ్యూహం ప్రకారం ఆక్సీజన్ ప్లాంటు ల సమీపం లోని తాత్కాలిక ఆసుపత్రు ల ఏర్పాటు ద్వారా స్వల్ప వ్యవధి లో సుమారు 10,000 ఆక్సీజన్ సహిత పడక ల ను సిద్ధం చేయవచ్చనే అంచనా ఉంది.

మహమ్మారి ని ఎదుర్కోవడం కోసం ఆక్సీజన్ సహిత పడకలతో పాటు ఇటువంటి మరిన్ని సౌకర్యాలను నెలకొల్పేటట్లు గా రాష్ట్ర ప్రభుత్వాల ను ప్రోత్సహించడం జరుగుతున్నది.

మరోవైపు పిఎస్ఎ ప్లాంటు ల ఏర్పాటు లో పురోగతి పైన కూడా ప్రధాన మంత్రి సమీక్ష జరిపారు.  దేశవ్యాప్తం గా పిఎమ్ కేర్స్, ప్రభుత్వ రంగ సంస్థ లు, ఇతర సంస్థ ల తోడ్పాటు తో దాదాపు గా 1,500 ప్లాంటుల ను ఏర్పాటు చేసే పని సాగుతోందని అధికారులు ప్రధాన మంత్రి కి తెలిపారు.  ఈ ప్లాంటు లు త్వరగా పూర్తి అయ్యేటట్టు చూడాలని అధికారుల ను ఆయన ఆదేశించారు.

సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, రోడ్ ట్రాన్స్ పోర్ట్ & హైవేస్ సెక్రట్రి లతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 


 

***



(Release ID: 1715561) Visitor Counter : 226