ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద 15,000 కోట్ల రూపాయలు సమకూర్చనున్న భారత ప్రభుత్వం
అసెట్ మానిటైజేషన్, పెట్టుబడుల ఉపసంహరణకు రాష్ట్రాలు రూ 5000 కోట్ల రూపాయలు పొందనున్నాయి.
2021-22 సంవత్సరానికి మూలధన వ్యయం కింద రాష్ట్రాలకు అందించే సహాయనికి మార్గదర్శకాలు విడుదల
Posted On:
30 APR 2021 1:21PM by PIB Hyderabad
భారతప్రభుత్వానికి చెందిన ఆర్ధిక మంత్రిత్వశాఖ, మూలధన ప్రాజెక్టులపై వ్యయం చేసేందుకు 50 సంవత్సరాల రుణంగా వడ్డీ లేని రుణం కింద అదనంగా 15,000 కోట్ల రూపాయలు అదనపు మొత్తాన్ని సమకూర్చాలని నిర్ణయించింది. వ్యయవిభాగం ఇందుకు సంబంధించి , మూలధన వ్యయానికి సంబంధించి రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం పేరుతో వ్యయ విభాగం 2021-22 ఆర్ధిక సంవత్సరానికి మార్గదర్శకాలు విడుదల చేసింది.
మూలధన పెట్టుబడి ఉపాధిని కలిగిస్తుంది. ప్రత్యేకించి పేదలు, నైపుణ్యంలేని వారు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. ఇది ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి భవిష్యత్ ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచుతుంది. దీనితో ఆర్ధిక వృద్ధి రేటు బాగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి సానుకూలంగా లేకపోయినప్పటికీ, రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద ప్రత్యేక సహాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించాలని గత ఏడాది నిర్ణయించారు.
ఈ పథకం కింద, వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రుణం రూపంలో ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు.
ఈ పథకం కింద 2020-21 సంవత్సరానికి ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 11,830 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేశారు. కోవిడ్ మహమ్మారి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో మూలధన వ్యయానికి ఇది సహాయపడింది.
ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని , రాష్ట్రప్రభుత్వాల విజ్ఞూప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని 2021-22 సంవత్సరానికి కూడా కొనసాగించాలని నిర్ణయించింది.
2021-22 సంవత్సరానికి రాష్ట్రాలకు మూలధన వ్యయానికి ప్రత్యేక సహాయ పథకం కింద మూడు భాగాలు ఉన్నాయిః
పార్ట్ః-1 : ఈ విభాగంలోని పథకం ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. ఈ విభాగానికి రూ 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఒక్కొక్కటి 400 కోట్ల రూపాయలు పొందుతాయి. ఈ గ్రూపులోని మిగిలిన రాష్ట్రాలకు ఒక్కొక్కదానికి 200 కోట్ల రూపాయలు కేటాయించారు.
పార్ట్ 2: ఈ విభాగం కింద పార్ట్-1 లో చేరని ఇతర రాష్ట్రాలు వస్తాయి. ఈ విభాగంలోని రాష్ట్రాల కోసం రూ 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15 వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్రపన్నులలో వాటి వాటా దామాషా ప్రకారం కేటాయించడం జరిగింది.
పార్ట్ 3: ఈ విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్, మౌలికసదుపాయాల ఆస్థుల రీసైక్లింగ్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్‌పిఎస్ఇసి) ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ పథకానికి రూ 5000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ విభాగం కింద, రాష్ట్రాలు అసెట్ మానిటైజేషన్, లిస్టింగ్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా పొందుతాయి.
అసెట్ మానిటైజేషన్ వాటివిలువను అన్‌లాక్ చేస్తుంది. అలాగే వాటి హోల్డింగ్ వ్యయాన్ని తొలగిస్తుంది.విలువైన ప్రజాధనాన్ని కొత్త ప్రాజెక్టులలో వినియోగించడానికి ఉపకరిస్తుంది. ఫలితంగా జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్ అమలు ఊపందుకుంటుంది.
భారత ప్రభుత్వం ఈ పథకం కింద రాష్ట్రాలకు కేటాయించే నిధులను కొత్త, లేదా ప్రస్తుతం అమలులో ఉన్న మూలధన ప్రాజెక్టులకు , రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చే పథకాలకు ఉపయోగించాలి. అలాగే ఈ పథకాలను ప్రస్తుత మూలధన పథకాల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూడా వినియోగించవచ్చు.
***
(Release ID: 1715140)
Visitor Counter : 263