ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మూడో దశ టీకాలకోసం ఈ ఉదయం 9.30 వరకు


2.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం 15.22 కోట్ల టీకాలు

గత 24 గంటల్లో 19 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు

అత్యధికంగా ఒక్క రోజులోనే కోలుకున్నవారు 3 లక్షలకు పైనే

Posted On: 30 APR 2021 11:09AM by PIB Hyderabad

మూడో దశ టీకాలకోసం ఏప్రిల్ 28న ప్రారంభించిన రిజిస్ట్రేషన్లలో భాగంగా కోవిన్ డిజిటల్ వేదికమీద ఈ రోజు ఉదయం

9.30 వరకు 2.45 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకోవటం గమనార్హం. 28 నాడే 1.37 కోట్లమందికి పైగా రిజిస్టర్ చేసుకోగా

29 ముగిసేసరికి మరో  1.04 కోట్లమందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా

డోసుల సంఖ్య 15.22 కోట్లను దాటింది.

ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా22,43,097 శిబిరాల ద్వారా   15,22,45,179 టీకా

డోసులివ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 93,86,904 మొదటి డోసులు,  61,91,118 రెండో డోసులు,  కోవిడ్

యోధులు అందుకున్న 1,24,19,965 మొదటి డోసులు, 67,07,862 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  

5,19,01,218 మొదటి డోసులు,  1,04,41,359 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్యవారు తీసుకున్న  5,17,78,842 మొదటి

డోసులు, 34,17,911 రెండో డోసులు అందులో ఉన్నాయి.   

అరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 మధ్య వయస్కులు

60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

93,86,904

61,91,118

1,24,19,965

67,07,862

5,17,78,842

34,17,911

5,19,01,218

1,04,41,359

15,22,45,179

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో 67.08% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.  

 

గడిచిన 24 గంటలలో 21 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది.  టీకాల కార్యక్రమం మొదలైన 104వ రోజైన

ఏప్రిల్ 29న 22,24,548 టీకాలిచ్చారు. అందులో  12,74,803 మందికి 21,810 శిబిరాల ద్వారా మొదటి డోస్,  9,49,745

మందికి రెండో డోస్ ఇచ్చారు.

తేదీ: ఏప్రిల్ 29, 2021 (104వ రోజు)

అరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్య వయస్కులు

60 పైబడ్దవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

19,398

43,200

1,00,065

95,073

7,53,956

2,62,493

4,01,384

5,48,979

12,74,803

9,49,745

 

గత 24 గంటలలో 19 లక్షలకు పైగా (19,20,107) కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. ఒక రోజులో అతిపెద్ద సంఖ్యలో జరిపిన

 పరీక్షలు ఇవి.  రోజువారీ కోవిడ్ పరీక్షలను, పాజిటివ్ శాతాన్ని దిగువ చిత్రపటం చూపుతోంది.

 

దేశంలో ఇప్పటిదాకా మొత్తం కోవిడ్ బారినుంచి బైటపడినవారి సంఖ్య 1,53,84,418 కు చేరుకోగా కోలుకున్నవారి శాతం 81.99%.

గత 24 గంటలలో 2,97,540 మంది కొలుకోగా ఇందులో పది రాష్ట్రాల వాటా 76.61%  

 

గడిచిన 24 గంటలలో 3,86,452 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. పది రాష్టాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక,

కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలోనే 73.05% కేసులు వచ్చాయి. మహారాష్టలో అత్యధికంగా

ఒక్క రోజులోనే 66,159 కేసులు రాగా కేరళలో 38,607, ఉత్తరప్రదేశ్ లో 35,104 కొత్త కేసులు వచ్చాయి.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనాతో చికిత్సపొందుతున్నవారి సంఖ్య 31,70,228 కు చేరింది. ఇది ఇప్పటిదాకా నమోదైన

మొత్తం పాజిటివ్ కేసులలో 16.90%.   గత 24 గంటలలో పెరిగిన చికిత్సలో ఉన్న బాధితుల సంఖ్య 85,414. వీరిలో 78.18%

కేసులవాటా పదకొండు రాష్ట్రాలదే .

జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం ప్రస్తుతం తగ్గుదల బాటలో సాగుతూ 1.11% కు చేరింది.

గత 24 గంటలలో 3,498 మంది కరోనా తో మరణించారు. ఇందులో 77.44% వాటా పది రాష్ట్రాలదే ఉంది. మహారాష్ట్రలో

అత్యధికంగా 771 మంది ఒక్క రోజులోనే కోవిడ్ తో చనిపోగా ఢిల్లీలో 395 మంది చనిపోయారు.

 

నాలుగు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు: అవి:

డాద్రా-నాగర్ హవేలి, డామన్-డయ్యూ, నాగాలాండ్, త్రిపుర, అండమాన్-నికోబార్ దీవులు  

 

అగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కింద పనిచేసే మెంటల్ హెల్త్, న్యూ రో సైన్స్ జాతీయ సంస్థ ( నిమ్హాన్స్)

రేయింబవళ్ళు పనిచేసే హెల్ప్ లైన్ (080-4611 0007) ఏర్పాటు చేసి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన

సమస్యలమీద ఈ సంక్షోభ సమయంలో సూచనలు, సలహాలతో అండగా నిలుస్తోంది.

.

 

****



(Release ID: 1715013) Visitor Counter : 189