భారత పోటీ ప్రోత్సాహక సంఘం

'సూపర్ మార్కెట్ గ్రోసెరీ సప్లైస్‌ ప్రైవేట్ లిమిటెడ్' (ఎస్‌జీఎస్) మొత్తం వాటా మూలధనంలో 64.3 శాతం వరకు 'టాటా డిజిటల్ లిమిటెడ్' కొనుగోలు చేసేందుకు; 'ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్'పై ఎస్‌జీఎస్‌ సంపూర్ణ నియంత్రణ పొందేందుకు సీసీఐ ఆమోదం


Posted On: 29 APR 2021 10:35AM by PIB Hyderabad

'సూపర్ మార్కెట్ గ్రోసెరీ సప్లైస్‌ ప్రైవేట్ లిమిటెడ్' (ఎస్‌జీఎస్) మొత్తం వాటా మూలధనంలో 64.3 శాతం వరకు 'టాటా డిజిటల్ లిమిటెడ్' (టీడీఎల్‌) కొనుగోలు చేసేందుకు; 'ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్'పై ఎస్‌జీఎస్‌ సంపూర్ణ నియంత్రణ పొందేందుకు 'కాంపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా' (సీసీఐ) ఆమోదం తెలిపింది.

ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా; ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో జరిగే ప్రాథమిక, ద్వితీయ కొనుగోళ్ల (లావాదేవీ-1) ద్వారా ఎస్‌జీఎస్‌ మొత్తం వాటా మూలధనంలో 64.3 శాతాన్ని (బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సాధారణ వాటాల ప్రాతిపదిక) టీడీఎల్‌ పొందుతుంది. ఆ తర్వాత, ప్రత్యేక లావాదేవీ (లావాదేవీ-2) ద్వారా ఐఆర్‌సీపై సంపూర్ణ నియంత్రణను ఎస్‌జీఎస్‌ పొందవచ్చు. లావాదేవీ-1, 2ను కలిపి ప్రతిపాదిత సముపార్జనగా సూచిస్తారు. దీని ఫలితంగా, ఎస్‌జీఎస్‌లో ప్రధాన వాటాను టీడీఎల్‌ దక్కించుకోవడమేగాక, ఆ సంస్థపై నియంత్రణ కలిగి ఉంటుంది.

'టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్' (టాటా సన్స్) సంపూర్ణ యాజమాన్యంలో ఉన్న అనుబంధ సంస్థ టీడీఎల్‌. ఇది, టాటా సన్స్ గ్రూపు కంపెనీలకు అంతిమ పెట్టుబడుల సంస్థ. గుర్తింపు &ప్రవేశ నిర్వహణ; విధేయత కార్యక్రమాలు; నజరానాలు & చెల్లింపులకు సంబంధించిన సాంకేతిక సేవలు అందించే వ్యాపారాలను టీడీఎల్‌ ప్రస్తుతం నిర్వహిస్తోంది. టాటా సన్స్ గ్రూపు, తన గ్రూపు కంపెనీల ద్వారా, భారత్‌లో (ఎ)  ఆహారం, కిరాణా వస్తువులు, గృహోపకరణాలు, వ్యక్తిగత, సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల (సంబంధిత ఉత్పత్తులు) బిజినెస్-టు-బిజినెస్ (బీ2బీ) అమ్మకాలు; (బి) భారత్‌లో, సంబంధిత ఉత్పత్తుల బిజినెస్‌-టు-కన్సూమర్‌ (బీ2సీ) అమ్మకాలు; (సి) భారత్‌, కొన్ని ప్యాకింగ్‌ చేసిన ఆహారం, కిరాణా వస్తువుల తయారీ, అమ్మకం వంటి వ్యాపారాలు చేస్తోంది.

భారతదేశ చట్టాల ప్రకారం ఎస్‌జీఎస్‌ ఏర్పాటైంది. భారత్‌లో, సంబంధిత ఉత్పత్తులను బీ2బీ పద్ధతిలో, business.bigbasket.com ద్వారా ఆన్‌లైన్‌లో అమ్ముతోంది.

భారతదేశ చట్టాల ప్రకారం ఐఆర్‌సీ ఏర్పాటైంది. భారత్‌లో, సంబంధిత ఉత్పత్తులను బీ2సీ పద్ధతిలో ఆన్‌లైన్‌లో అమ్ముతోంది. www.bigbasket.com వెబ్‌సైట్‌ను, మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా నిర్వహిస్తోంది.

 సీసీఐ నుంచి సవివర ఆదేశం రావలసివుంది.

******



(Release ID: 1714904) Visitor Counter : 206