ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ నిర్వహణ కు సంబంధించి సైన్యం సన్నద్ధత ను, సైన్యం చేపడుతున్న కార్యకలాపాల ను సమీక్షించిన ప్ర‌ధాన మంత్రి


Posted On: 29 APR 2021 1:24PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శ్రీ ఎమ్.ఎమ్. నరవణే ఈ రోజు న సమావేశమయ్యారు.

వారు కోవిడ్ నిర్వహణ కు సంబంధించి సాయపడడానికి సైన్యం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలను గురించి చర్చించారు.

సైన్యం లోని వైద్య సిబ్బంది సేవల ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కు సమకూర్చుతున్నట్లు ప్ర‌ధాన మంత్రి దృష్టి కి జనరల్ శ్రీ నరవణే తీసుకు వచ్చారు. సైన్యం దేశం లోని వేరు వేరు ప్రాంతాల లో తాత్కాలిక ఆసుపత్రుల ను ఏర్పాటు చేస్తోందని కూడా ఆయన ప్రధాన మంత్రి కి తెలిపారు.



సాధ్యమైన చోట్లల్లా సాధారణ పౌరులకై సైన్యం తన ఆసుపత్రుల ను తెరచి అవసరమైనటువంటి సేవలను వారికి అందిస్తోందని ప్రధాన మంత్రి కి జనరల్ శ్రీ నరవణే తెలియజేశారు. పౌరులు వారికి దగ్గర లోని సైన్య ఆసుపత్రుల ను సంప్రదించవచ్చు అని కూడా జనరల్ శ్రీ నరవణే అన్నారు.

దిగుమతి చేసుకొన్న ఆక్సీజన్ టాంకర్ ల కోసం, వాహనాల కోసం ఒకవేళ ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమైనటువంటి పక్షంలో, సైన్యం అంగబలం తో సహాయాన్ని అందజేస్తోందని ప్రధాన మంత్రి కి జనరల్ శ్రీ నరవణే వివరించారు.

***



(Release ID: 1714898) Visitor Counter : 217