ప్రధాన మంత్రి కార్యాలయం

రష్యా అధ్యక్షుడు శ్రీ పుతిన్‌ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 28 APR 2021 7:51PM by PIB Hyderabad

రష్యా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడారు.

కోవిడ్-19 మహమ్మారి తో తలెత్తిన స్థితి పై ఇరువురు నేత లు చర్చించారు.  అధ్యక్షుడు శ్రీ పుతిన్ భారత ప్రజల కు, ప్రభుత్వాని కి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, రష్యా ఈ మహమ్మారి కాలం లో సాధ్యమైన అన్ని విధాలుగాను సహకరిస్తుందని తెలిపారు.  అధ్యక్షుడు శ్రీ పుతిన్‌ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు పలుకుతూ, భారతదేశాని కి రష్యా తక్షణ సహకారాన్ని అందించడం చాలా కాలం గా ఉన్న మన భాగస్వామ్యాని కి ఒక సంకేతం గా ఉందన్నారు.

విశ్వమారి తో పోరాడడానికి రెండు దేశాల మధ్య  నెలకొన్న సహకారాన్ని గురించి ఇరువురు నేత లు చర్చించారు.  స్పుత్నిక్-వి టీకా మందు ను భారతదేశం లో అత్యవసరం గా ఉపయోగించడానికి ఆమోదం తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ పుతిన్ ప్రశంస ను వ్యక్తం చేశారు.  భారతదేశం, రష్యాల తో పాటు ఇతర దేశాల లో ఉపయోగించడానికి రష్యా కు చెందిన ఈ టీకా మందు ను భారతదేశం లో తయారు చేయడం జరుగుతుంది అనే అంశం సైతం చర్చ లో ప్రస్తావన కు వచ్చింది.

ఉభయ దేశాల మధ్య గల ప్రత్యేకమైనటువంటి, విశేషమైనటువంటి భాగస్వామ్యం లో భాగం గా, వివిధ రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా పెంచుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉందని ఇద్దరు నేత లు నొక్కిచెప్పారు.  భారతదేశం గగన్ యాన్ కార్యక్రమం కోసం రష్యా నుంచి సహకారం లభించడంతో పాటు, నలుగురు గగన్ యాన్ అంతరిక్ష యాత్రికుల కు రష్యా లో శిక్షణ పూర్తి కావడం పట్ల లకూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసను వ్యక్తం చేశారు.

హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థ సహా నవీకరణయోగ్య శక్తి రంగం లో సహకారాన్ని పెంపొందించుకోవడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు చర్చించారు.

రెండు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి పాలుపంచుకొనే 2+2 మంత్రుల స్థాయి సంభాషణ ను ఏర్పాటు చేయాలని నేత లు నిర్ణయించారు.

వ్లాడివోస్తోక్‌ లో 2019వ సంవత్సరం సెప్టెంబరు లో వారి ఆఖరి శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తీసుకొన్న ముఖ్య నిర్ణయాల ను ఇరువురు నేత లు గుర్తు కు తెచ్చుకొన్నారు.   వారి వ్యక్తిగత సంభాషణ ను, విశ్వసనీయమైన సంభాషణ ను ముందుకు తీసుకుపోయేందుకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఈ సంవత్సరం చివర లో ఏర్పాటయ్యే ద్వైపాక్షిక సమ్మేళనం కోసం అధ్యక్షుడు శ్రీ పుతిన్ భారతదేశానికి విచ్చేసే అంశం లో  తాను ఉత్సుకత తో ఉన్నానని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.  2021వ సంవత్సరం లో బ్రిక్స్ తాలూకు సఫలతపూర్వకమైన అధ్యక్షత కోసం భారతదేశానికి రష్యా పూర్తి గా సహకరిస్తుంది అంటూ అధ్యక్షుడు శ్రీ పుతిన్ హామీ ని ఇచ్చారు.  ద్వైపాక్షిక అంశాల పైన, అంతర్జాతీయ అంశాల పైన నిరంతరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని నేత లు ఇద్దరూ అంగీకరించారు.

 


 

***


(Release ID: 1714771) Visitor Counter : 210