ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు
ఉచితంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు 16 కోట్లు
ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల
దగ్గర నిల్వ ఉన్న టీకా డోసులు కోటి
వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రాలకు అందనున్న
57 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసులు
Posted On:
28 APR 2021 11:49AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత ప్రభుత్వం ముందుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఐదు అంశాల వ్యూహం ( పరీక్షలు, ఆచూకీ
పట్టుకోవటం, చికిత్స అందించటం, కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటించటం, టీకాలు వేయించటం) లో టీకాలు
వేయటమన్నది చాలా కీలకమైన అంశం. టీకాల కార్యక్రమాన్ని మరింత సరళతరం చేస్తూ మే 1 వ తేదీనుంచి మూడవ దశ
అమలు చేస్తుండగా అర్హులైన వారందరూ ఈరోజు (ఏప్రిల్ 28) సాయంత్రం 4 గంటలనుంచి కోవిన్ పోర్టల్
(cowin.gov.in) ద్వారా గాని, ఆరోగ్య సేతు యాప్ ద్వారా గాని నమోదు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వం ఇప్పటిదాకా 16 కోట్ల టీకా డోసులు (15,95,96,140) రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ
చేసింది. ఇందులో రాష్టాలు వాడుకున్నవి ( వృధా చేసినవాటితో సహా) 14,89,76,248 డోసులు. ఇప్పటికీ రాష్టాలు, కేంద్రపాలిత
ప్రాంతాల దగ్గర కోటికి పైగా (1,06,19,892) డోసులు నిల్వ ఉన్నాయి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చే మూడు రోజులలో
57 లక్షలు (57,70,000) టీకా డోసులు అందించటానికి ఏర్పాట్లు చేసింది.
ఇటీవలి కాలంలో మహారాష్ట్ర రాష్ట ప్రభుత్వ అధికారులు తమ దగ్గర ఉన్న టీకాలు అయిపోయాయని, తగినన్ని డోసులు
అందటం లేదని అందువలన టీకాల కార్యక్రమం తీవ్రంగా దెబ్బతింటున్నదని చెప్పటాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ విషయమై
వివరణ ఇస్తూ, ఏప్రిల్ 28, 2021 ఉదయం 8 గంటల వరకు మహారాష్టకు ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు 1,58,62,470 కాగా,
ఇందులో వృధా (0.22%) పోగా 1,53,56,151 డోసుల పంపిణీ జరిగింది. ఆ విధంగా ప్రస్తుత నిల్వ 5,06,319 డోసులు
అర్హులకు ఇవ్వటానికి అందుబాటులో ఉన్నాయి. వచ్చే మూడు రోజులలో 5 లక్షల డోసులు మహారాష్ట్రకు అందబోతున్నాయి.
****
(Release ID: 1714727)
Visitor Counter : 212
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam